TELUGU

Homemade Bleach: తక్షణ కాంతివంతమైన చర్మం కోసం నేచురల్‌ ఫేస్ బ్లీచ్ ..!

Natural Bleachs For Face: పెళ్లి లేదా ఇతర ముఖ్యమైన సందర్భాలలో తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు. బ్యూటీ పార్లర్‌లలో చేసే బ్లీచ్‌లలో కెమికల్స్ ఉండడం వల్ల చాలా మంది నచ్చకపోవచ్చు. అయితే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో తయారు చేసుకునే ఫేషియల్ బ్లీచ్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి, ట్యాన్ తొలగిస్తాయి. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకొనే బ్లీచ్‌ పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 1. కస్తూరీ పసుపు: పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మాన్ని ఎంతో సహాయపడే సహాజమైన పదార్థం. ఇది మొటిమలను, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే దీంతో బ్లీచ్‌ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక టీ స్పూన్ కస్తూరీ పసుపు పొడి, ఆరెంజ్‌ తొక్కల పొడి, వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్ని గిన్నెను తీసుకొని అందులోకి కస్తూరీ పసుపు పొడి, ఆరెంజ్‌ పొడిని నీటీని కలుపుకోవాలి. దీని పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాని కడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 2. బంగాళదుంప: బ్లీచ్‌ తయారు చేయడానికి బంగాళాదుంపలు, టమాటా, దోసకాయ వంటి పదార్థాలు సహాయపడుతాయి. వీటిని పేస్ట్‌లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల చర్మంపై ఉండే మొటిమలు, ముడలు, మురికి తొలగించడంలో సహాయపడుతుంది. దీని వారంలో రెండు సార్లు రాసుకోవడం చాలా మంచిది. బంగాళదుంపలో విటమిన్ సి, కోజిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది చర్మం రంగును పెంచడంలో సహాయపడుతంది. ౩. దోసకాయ: దోసకాయలోని నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది చర్మాన్నికి తేమను అందిస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దోసకాయ ఉపయోగించి బ్లీచ్‌ తయారు చేసుకోవచ్చ. దీని కోసం దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. దోసకాయను మిక్సీలో మెత్తగా చేసి పేస్ట్‌గా తయారు చేసి ముఖంపై అప్లై చేయండి. 20-25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. 4. ముల్తాని మట్టి: ముల్తాని మట్టిని నీరు లేదా రోజ్ వాటర్‌తో కలిపి ముఖం ప్యాక్‌గా వాడవచ్చు. ముల్తాని మట్టి తైలం ఎక్కువగా ఉండే చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్తాని మట్టిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ముల్తాని మట్టి చర్మాన్ని శుభ్రపరచి, మృదువుగా చేస్తుంది. గమనిక: అయితే ఏదైనా కొత్త పదార్థాన్ని ముఖం వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.