TELUGU

Karthika Deepam2: దీప రెస్టారెంట్‌.. శివన్నారాయణతో శపథం చేసిన కార్తీక్‌, కంగుతిన్న జ్యోత్స్న

Karthika Deepam 2 Today December 19th Episode: ఆ డబ్బుతో రెస్టారెంట్‌ లీజ్ తీసుకోవడం కాదు, రెస్టారెంట్‌ కొనుక్కోవచ్చు అంటుంది. వద్దు అని కార్తీక్‌ వారిస్తాడు అది నీ ఆస్తి, ఉమ్మడి ఆస్తి అంటాడు. దీంతో కాంచన ఏడుస్తుంది. నీది నాదీ అని వేరు చేయకు నా కొడుకువు కదా.. నీ ముందు నాకు ఆస్తి ఎంత? అంటుంది. తల్లికొడుకుల మధ్య ప్రేమను బాగా పండించే సీన్ వస్తుంది. బ్యాంక్ మేనేజర్‌ నాకు తెలుసు నేను మాట్లాడతా అంటాడు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రేపే ఆయన్ను పిలుద్దాం అంటాడు. అయితే, ఎవరిపేరుపై పెడదాం అనుకుంటారు. చివరగా మాతాతా భార్య పేరు పెట్టారు నేను కూడా దీప రెస్టారెంట్‌ అని పెడతా అంటాడు. అందరూ బాగుంది అని చప్పట్లు కొడతారు. దీప కంగారు పడుతుంది. వద్దమ్మ నా పేరు మీద ఏ రెస్టారెంట్ వద్దు అంటుంది. వెంటనే దాసు అల్లుడి చేసిన కరెక్టేనమ్మా అంటాడు. ఈ బామ్మర్ది ఎప్పటికీ నీతోనే ఉంటాడు అంటాడు కాశీ. కంగ్రాట్స్‌ అమ్మప నీ భర్త గెలుపే నీ గెలుపు అంటాడు దాసు. అల్లుడు మీరు కొత్త రెస్టారెంట్‌ పెట్టబోతున్నారు అని అందరికీ చెప్పండి అని వెళ్లిపోతాడు దాసు. వదిన.. నీ పేరుపై రెస్టారెంట్‌ పెడుతున్నారు కాబట్టి స్వీట్‌ చేయ్‌ అంటుంది దీప మరదలు. మరోవైపు జ్యోత్స్న బావను ఏదోకటి చేసి దీపను దూరం చేయాలి అని ప్లాన్‌ వేస్తుంది. అప్పుడే దాస్‌ వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నావ్‌ కదా అంటాడు.దీంతో కంగారు పడుతుంది జ్యోత్స్న. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు నాన్న అందరూ చూస్తే ప్రాబ్లం అంటుంది. నువ్వు దీప విషయంలో టెన్షన్‌ పడుతున్నావ్‌. కార్తీక్‌ను బయటకు పంపించేశారు. అది మంచి పని ఎందుకంటే ఓన్‌గా పెట్టుకుంటున్నాడు. ఇంటి మీద బ్యాంక్‌ లోన్ తీసి బిజినెస్ స్టార్ట్‌ చేస్తున్నాడు అంటాడు. గుడ్‌.. నా మీద ఉన్న కోపంతో సొంత బిజినెస్‌ పెడుతున్నాడా? అంటుంది. దీప పేరుపై పెడుతున్నాడు.. దయ చేసి నువ్వు వారి జీవితంలో వస్తున్న ప్రశాంతతను పోగొట్టకు నీతో కాదు ఇక ఎవరితోనే చెప్పాల్సి ఉంటుంది. లేదు నాన్న నేను ఇలాగే ఉంటాను దీప జోలికి వెళ్లను అంటుంది జ్యోత్స్న. నాకు పోటీగా దీపను నిలబెడతావా? ఇప్పుడు దీప పరువు ఎలా తీస్తానో చూడు అని తాతా.. తాతా.. అంటూ లోపలికి వెళ్తుంది. అసలు విషయం చెబుతుంది. దీప రెస్టారెంట్‌ అని దీప పేరు మీద బావ రెస్టారెంట్‌ పెడుతున్నాడు. నా మేనత్త రెస్టారెంట్‌కు ఇంటి మీద బ్యాంక్‌ లోన్‌ తీసుకుని మరీ పెడుతుంది. మన బిజినెస్‌ పతనానికే ఇదిఅంటుంది జ్యోత్స్స. దీప పేరు మీద రెస్టారెంట్ నిజమే అయితే, వాళ్లను ఏం చేయాలో నాకు తెలుసు. అది శివన్నారాయణ పరువు దాన్ని తాకట్టు పెడతారా? నువు పదా జ్యోత్స్న అని వెళ్తారు. బ్యాంకు అధికారి ఇంట పేపర్లను చూస్తుంటాడు. కాంచనను సంతకం పెట్టమంటాడు. అప్పుడే తాతగారు వస్తారు. నేను కూడా ఎక్కడ సైన్‌ చేయాలి అంటాడు. నీ అంతట నువ్వే రిజైన్‌ చేశావు బావ అంటుంది జ్యోత్స్న. ఇదీ చదవండి: కార్తీక్‌ రెస్టారెంట్‌ ప్లాన్‌.. కావేరి స్వీట్స్‌తో విలవిలా, అంతా అయిపోయిందమ్మా.. తలపొగరుతో నీ కొడుకు రిజైన్‌ చేశాడు అంటాడు. ఏంటి ఇవి.. ఇక్కడ ఏం జరుగుతుంది? అంటాడు శివన్నారాయణ, వినడం వల్ల మీకు ఉపయోగం లేదు చెప్పడం వల్ల మాకు ఉపయోగం లేదు. రెస్టారెంట్‌ ప్లాన్‌ చెబుతాడు. మరి రెస్టారెంట్‌ ఎవరిపై పెడతావ్‌ అంటాడు. నా భార్యపేరుపై దీప రెస్టారెంట్‌ పెడుతున్నా అంటాడు.ఎలా ఉంది పేరు అంటాడు. మనవరాలా.. నువ్వు నాకోసం ఓపుస్తకం రాస్తావా? అంటాడు. సైకిల్‌ మీద టిఫిన్‌ సెంటర్‌ అమ్మే దీప హైదరాబాద్‌లో స్టార్‌ రెస్టారెంట్‌ ఓనర్‌ కాబోతుంది అంటాడు శివన్నారాయణ. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.