TELUGU

Allu Arjun Arrest: దా పుష్ప విచారిస్తాం.. అల్లు అర్జున్ పై బిగుస్తోన్న ఉచ్చు..

Allu Arjun Arrest : తొక్కిసలాట ఘటనతో పాటు అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం పట్లు పోలీసు శాఖ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆ దిశగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు పోలీసుల తదుపరి చర్యలపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్‌ను మళ్లీ విచారణకు పిలిపిస్తే ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇంట్లో కీలక సమావేశం జరుగింది. తమ లీగల్‌ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ అయ్యి చర్చించారు. పోలీసుల తాజా నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. విచారణలో పోలీసుల అడగబోయే ప్రశ్నలపై చర్చించారు. తమ లీగల్ టీమ్‌ నుంచి న్యాయ పరమైన సలహాలను అల్లు అర్జున్‌ తీసుకున్నారు. డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ A11గా నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది. మరోవైపు అల్లు అర్జున్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎవరికీ మాట్లాడకూడదని హెచ్చరించారు. మరోవైపు కొంత మంది నెటిజన్స్ అల్లు అర్జున్ .. సల్మాన్ ఖాన్ లా ఫుట్ పాత్ పై పడుకున్న వారిపై మదమెక్కి కారు ఎక్కించాడా.. లేకపోతే కృష్ణ జింకలను వేటాడాడా.. షారుఖ్ ఖాన్ కొడుకు మాదిరి డ్రగ్స్ తీసుకున్నాడా.. తన ప్రమేయం అంతగా లేని ఘటనపై ఆయన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్స్ తెలంగాణ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.