TELUGU

Kali Crown Theft Video: వామ్మో.. ఎంతకు తెగించాడు.. మోదీ అమ్మవారికి ఇచ్చిన కానుకనే కొట్టేశాడు.. వీడియో వైరల్..

Goddess kali crown gifted by pm modi stolen from Bangladesh: దేశంలో ప్రస్తుతం దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబరు 3 న ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబరు 12 వరకు కొనసాగనున్నాయి. అదే విధంగా 12న దసరాను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రోజుల్లో కూడా రోజుకోక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల కోరికలను నెరవేరుస్తారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కూడా నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తితో చేస్తారు.ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే.. మోదీ గతంలో 2021 లో.. ఒకసారి బంగ్లాదేశ్ లో ఉన్న ప్రసిధ్దమైన శక్తిపీఠంమైన సత్‌ఖిరా నగరంలో ఉన్న శ్యామ్‌నగర్‌ ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంను సందర్శించారు. A precious crown of Goddess Kali, gifted by Prime Minister Narendra Modi, has been stolen from the Jeshoreshwari Temple in Shyamnagar, Satkhira, Bangladesh. The theft of the crown is just a loss of a valuable artifact but a breach of cultural and spiritual sanctity. The focus… pic.twitter.com/FsAX4F7IYc — V Chandramouli (@VChandramouli6) October 11, 2024 అంతేకాకుండా.. అక్కడ అమ్మవారికి బంగారు కిరిటం సైతం సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా..ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో అమ్మవారికి అలంకరించారు.ఈ నేపథ్యంలో.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చోటు చేసుకుంది. ఆ ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం... రోజు లాగే గురువారం పూజను పూర్తి చేసిన తర్వాత ఆలయానికి సంబంధించిన తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. అయితే ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్.. తిరిగి వచ్చి చూసే వరకు కాళీ మాత ధరించిన బంగారు కిరీటం కనిపించలేదు. దీంతో ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఒక యువకుడు వచ్చి అమ్మవారి కిరీటంను తీసి, షర్ట్ లో వేసుకొని పారిపోవడం అందులో రికార్డు అయ్యింది. అసలే నవరాత్రులు,అది కూడా ప్రధాని మోదీ అమ్మవారికి ఇచ్చిన కానుక చోరీకి గురికావడం ప్రస్తుతం దేశంలో కలకలంగా మారింది. Read more: Viral Video: ఏంది భయ్యా.. ఈ టాలెంట్.. దాండియా ఆడుకుంటూ బుక్ రీడింగ్.. వీడియో వైరల్.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూ పురాణాల ప్రకారం, 51 పీఠాలలో, ఈశ్వరీపూర్‌లోని ఆలయం సతీదేవి యొక్క అరచేతులు, అరికాళ్ళు పడిపోయిన ప్రదేశం. అక్కడ దేవత దేవి జశోరేశ్వరి రూపంలో నివసిస్తుంది. అదే విధంగా శివుడు చండ రూపంలో కనిపిస్తాడు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.