TELUGU

Lawrence Bishnoi:లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ లిస్ట్ లో స్టార్ కమెడియన్.. షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్.. క్రిమినల్ చరిత్ర కలిగిన ఇతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ అతడిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలకపాత్ర పోషించారు లారెన్స్ అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన నెక్స్ట్ టార్గెట్ హిందూ మతాన్ని అవహేళన చేసిన ఒక బాలీవుడ్ స్టార్ కమెడియన్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాబా సిద్ధిఖీ ను అత్యంత దారుణంగా హతమార్చడం కోట్లాదిమంది భారతీయులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రవీణ్ లోంకర్ , గుర్మైల్ బల్జిత్ సింగ్ , ధర్మరాజ్ కశ్యప్ లను ప్రధాన నిందితులుగా చేరుస్తూ పరిస్థితి చేశారు. ఇకపోతే బాబా సిద్ధికి హత్యకు నెల రోజుల నుంచి ప్లాన్ చేసిన ఈ గ్యాంగ్ హత్య బెదిరింపులు కూడా చేశారు. అతనితో వై ప్లస్ భద్రత ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ కు హెచ్చరికగా లారెన్స్ ఈ హత్య చేశారని ఆ గ్యాంగ్ చెప్పుకొచ్చింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిష్ణోయ్ కమ్యూనిటీకి పవిత్రమైన జంతువైన కృష్ణ జంకను అతి కిరాతకంగా చంపినందుకు బాబా సిద్ధిఖీని హతమార్చినట్లు సమాచారం. ఇప్పుడు లారెన్స్ భిష్ణోయ్ సిద్ధం చేసుకున్న లిస్టులో హిందూ దేవుళ్లను అపహాస్యం చేసినందుకు ఒక పెద్ద హాస్యనటుడిని హతమార్చడానికి ఈయన ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు అలా బయటకి వచ్చాయో లేదో మునవర్ ఫరూక్ అయి ఉంటారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. స్టాండ్ అప్ కమెడియన్ గా పేరు దక్కించుకున్న ఈయన హిందూ మతంపై తన జోకులను దైవ దూషణంగా పేర్కొనడంతో మధ్యప్రదేశ్లో కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారు. ముఖ్యంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామ, సీత , లక్ష్మణులను అపహాస్యం చేస్తూ మునవర్ ఫరూక్ కామెంట్లు చేశారు. ఇప్పుడు అతడిని హత్య చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే లారెన్స్ బిష్ణోయ్ శరీరం పై దేవుళ్ళ పచ్చబొట్టులు మనకు చాలా కనిపిస్తాయి. ఇకపోతే కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అలాగే జైల్లో ఉన్నప్పుడు మొత్తం 700 మందితో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడట లారెన్స్ . తన అనుబంధాన్ని ఏర్పరచడంలో జైలు సిబ్బంది కూడా అతనికి సహాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పుడు హాస్యనటుడికి రక్షణ కల్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Read more: Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.