TELUGU

Child Marriage: ఒరేయ్ బుద్ధి లేదా..? 72 ఏళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలికకు వివాహం.. పోలీసులు దిమ్మతిరిగే ట్విస్ట్

Child Marriage in Pakistan: పాకిస్థాన్‌లో అభివృద్ధి విషయం దేవుడెరుగు కానీ.. బాల్య వివాహాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రహాస్యంగా ఈ వివాహాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా 12 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన 72 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని చర్సద్దా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుడిని, 'నికాహ్ ఖ్వాన్' (వివాహాన్ని ఘనంగా జరిపే వ్యక్తి)ని పోలీసులు అరెస్ట్ చేయగా.. బాలిక తండ్రి తప్పించుకుని పారిపోయాడు. బాలికను రూ.5 లక్షలకు విక్రయించినట్లు తేలింది. బాల్య వివాహ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా.. Also Read: Palla Srinivas Yadav: పల్లా శ్రీనివాస్‌కే వరించిన తెలుగు దేశం అధ్యక్ష పీఠం.. ఆయన రాజకీయ చరిత్ర తెలుసా? చర్సద్దా నగరంలోని హబీబ్ ఖాన్ 72 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలిక (12)ను వివాహం చేసుకునేందుకు ఆమె తండ్రికి రూ.5 లక్షలు ఇచ్చాడు. అమ్మాయి తండ్రి పెళ్లికి ఏర్పాట్లు చేయగా.. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. వరుడుతోపాటు నికాహ్‌ ఖ్వాన్, పెళ్లి పెద్దలను కూడా అరెస్టు చేశారు. మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి ఆలం సయ్యద్ తన కుమార్తెను రూ.5 లక్షల పాకిస్థానీ రూపాయలకు వృద్ధుడికి విక్రయించేందుకు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్‌లో బాల్య వివాహాలను నిషేధించే చట్టాలు ఉన్నా.. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పాకిస్థాన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రాజన్‌పూర్, తట్టాలో బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. తట్టలో 50 ఏళ్ల భూస్వామితో మైనర్ బాలికను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఈ పెళ్లిళ్ల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. బాలికలను రక్షించారు. వారిని రిస్క్యూ చేసి.. పెళ్లి చేసుకున్న వ్యక్తులను, జరిపించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అక్కడ పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు.. మన దేశంలో కంటే భిన్నంగా ఉంటుంది. అబ్బాయిలకు 18 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితే వివాహం చేసుకోవడానికి చట్టాలు అనుమతిస్తాయి. అయితే ఇది చాలా చోట్ల అమలు కావడం లేదు. 2013లో పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ లింగ సమానత్వం వైపు అడుగులు వేసింది. ఇద్దరికీ 18 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేసుకోవాలని రూల్ తీసుకువచ్చినా.. దేశవ్యాప్తంగా అమలు కాలేదు. అమ్మాయిలకు 16 ఏళ్లు నిండగానే వివాహం జరిపిస్తున్నారు. Also Read: Medak Incident: రాత్రికి రాత్రి మెదక్‌లో ఏం జరిగింది? ఉద్రిక్తత పరిస్థితులకు కారణాలు ఏమిటి స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.