TELUGU

Haryanna Congress Loss: హరియాణా ఎందుకు "చేయి" జారింది..

Haryanna Congress Loss : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన హరియాణా ఎన్నికలు ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. బీజేపీ వరుసగా మూడో సారి ఘన విజయంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. దీంతో హర్యానా వ్యాప్తంగా బీజేపీ సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గోవా తర్వాత బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు హరియాణా ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లింది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు తమదే విజయం అనుకున్న కాంగ్రెస్ కు రిజల్స్ప్ పెద్ద షాక్ ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే విజయం అని ఢంకా బజాయించాయి. కానీ ఫలితాలు మాత్రం మరోలా వచ్చాయి. మొత్తంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ హరియాణా విషయంలో బొక్కబోర్లా పడ్డాయి. కౌంటింగ్ మొదలైన గంటలో కాంగ్రెస్ కు అనుకూలంగా వాతావరణం కనిపించింది. అసలు కాంగ్రెస్ ది అక్కడ వన్ సైడ్ విక్టరీ అనుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కోలాహలంగా మారింది. స్వీట్లు పంచుకుంటూ, డోలు వాయిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా చేయడం మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ సంతోషం కొద్ది సేపు కూడా నిలవలేదు. ఒక్క సారిగా బీజేపీ తిరిగి పుంజుకుంది. విజయం రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతూ చివరకు బీజేపీకీ విజయం వరించింది. దీంతో హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ తో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం హరియాణా లో ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి. హరియాణా లో విజయం తమదే అని గట్టిగా నమ్మకుంది కానీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురి చేశాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది అని కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున అంతర్మధనం మొదలైంది. దీంతో కాంగ్రెస్ తన ఓటమిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంది. తమ పార్టీ ఓటమిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఈసీకీ లేఖ రాసింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మరో అడుగు ముందుకేసి హరియాణాలో గెలవాల్సింది కాంగ్రెస్ బీజేపీ ఎలా గెలిచిందో తమకు అర్థం కావడం లేదని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఇంతకీ కాంగ్రెస్ ఓటమికి కారణాలపై మాత్రం బయట రకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. హరియాణా లో కుల సమీకరణాలు పని చేశాయనే వాదన గట్టిగా వినబడుతుంది. జాట్లు కాంగ్రెస్ కు ఏక పక్షంగా మద్దతు తెలపగా మిగితా వర్గాలు బీజేపీకీ అండగా నిలిచినట్టు ఎన్నికల ఫలితాను తెలుస్తుంది. అంతేకాదు గత రెండు ఎన్నికల కంటే 40 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో జాట్లు అధికంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది.మిగితా చోట్ల బీజేపీ విజయం సాధించింది. అయితే ఎన్నికల తర్వాత వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే విజయం అని ఏకపక్షంగా అన్ని సంస్థలు ప్రకటించాయి. కానీ ఫలితాలు మాత్రం మరోలా వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ఎంతో ఆశలు పెట్టుకున్న హరియాణా చేజారింది. కాంగ్రెస్ ఓటమికి మరో చర్చ కూడా తెరపై ఉంది. హర్యానాలో కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే వాదన కూడా లేకపోలేదు. పైగా హుడా, సెల్జా మధ్య విభేదాలు కూడా ఓటమికి కారణంగా నిలిచాయి. రీసెంట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూటమిగా జట్టు కట్టి ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందింది. కానీ హరియాణా లో మాత్రం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన్నది అన్న వాదన వినబడుతుంది. మిత్రపక్షాలను కలుపుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. హరియాణా లో ఓటమి తర్వాత ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అతిగా ఊహించుకొని ఓటమి పాలైందని కూటమి పార్టీలు విమర్శించాయి. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ ఓటమిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఎన్నికల కమిషన్ ను కూడా కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. హరియాణా ఎన్నికల ఫలితాలపై తాము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని కాంగ్రెస్ చెబుతోంది. మాకు ఉన్న అనుమానాలను ఎన్నికల కమిషన్ తీర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. కౌంటింగ్ రోజు ఫలితాలు ప్రకటించే విషయంలో ఈసీ ఎందుకు తాత్సార్యం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఎన్నికల కమిషన్ పై కేంద్రం ఒత్తిడి ఉందా అందుకే ఇలా చేసిందా చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉందని కాంగ్రెస్ అంటోంది. ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..! ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ఐతే హరియాణా విషయంలో కాంగ్రెస్ తీరు ఎలా ఉన్నా ఎన్నికల కమిషన్ తీరుపై మాత్రం అనేక సందేహాలు వస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ ఇలాంటి అనుమానాన్నే వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలపై మాకు అనేక సందేహాలు ఉన్నాయని ఇప్పటికీ పలు సందర్భాల్లో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముగిసాక వంద రోజుల తర్వాత ఈసీ వెబ్ సైట్లో ఫార్మ్ 20 ను అప్ లోడ్ చేయడానికి కారణమేంటని వైసీపీ ప్రశ్నిస్తుంది.ఇలాంటి తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా హర్యానా ఎన్నికలపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈసీపై ప్రజల్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలు నిందలు వెతుక్కోవడం సహజమనే వాదన కూడా లేకపోలేదు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకునే పార్టీలు ఓడితే మాత్రం నెపాన్ని ఈవీఎంలపై నెట్టడం ఎంత వరకు సబబు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అంతమాత్రాన ఓటమి పాలైన వారు ప్రజల తీర్పు అపహాస్యం చేయడం కరెక్టు కాదనే వాదన వినపడుతుంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా పార్టీలు అనుమానాలను తాత్సారం చేయకుండా నివృత్తి చేస్తే ఎన్నికల సంఘంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఇలా హరియాణా ఓటమితో దిమ్మదిరిగిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసే పనిలో ఉంది. ఒక వైపు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే మరోవైపు ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడింది. మరి కాంగ్రెస్ పోస్ట్ మార్టమ్ లో ఏమి తేలుతుంది. పార్టీ ఓటిమికి ఈవీఎం ల కారణమా..? లేక మరే ఇతర కారణాలా అన్నది మాత్రం తేల్చాల్సి మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఇదీ చదవండి: Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే.. ఇదీ చదవండి: Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.