TELUGU

Ratan Tata: దేశంలో లంచాన్ని ఎలా అరికట్టాలి.. రతన్ టాటా చెప్పిన సమాధానం తెలిస్తే మైండ్ బ్లోయింగ్.. అంతే..

Ratan tata comments on corruption control: టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా చనిపోయారనే వార్త యావత్ దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పుకొవచ్చు. రతన్ టాటా కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా.. సమాజ సేవలను తనదైన మార్కు చూపించారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా నిన్న రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో రాత్రి 11 గంటలకు చనిపోయారు. ఇదిలా ఉండగా.. ఆయన మరణంపట్ల కేవలం వ్యాపార దిగ్గజాలు మాత్రమే కాకుండా.. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రతన్ టాటా జీవితంలో జరిగిన అనేక ఘట్టాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యుడు కారు ఎందుకు ఎక్కకూడదని.. ఆయన చేసిన ఆలోచనల నుంచి నానో పుట్టడమే కాకుండా.. దాన్ని సాకారం కూడా చేశారు. ఆయన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినప్పుటు అక్కడ పరిస్థితులు ఆయన మీద ఎంతగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆయన టాటా గ్రూప్స్ కు చైర్మన్ గా ఉన్న కూడా ఎప్పుడు కూడా ఆడంబారాలకు పోకుండా.. ఎంతో సింపుల్ గా ఉండేవారు. ఆయన సింపుల్ లివింగ్.. హై థింకింగ్ కు బ్రాండ్ గా ఉండేవారు. ఇదిలా ఉండగా.. రతన్ టాటాకు గతంలో ఒక ఆయన మిత్రుడోకరు దేశంలో లంచాన్ని ఎలా నిర్మూలించాలని అడిగారంట. దీనికి రతన్ టాటా తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలు.. దేశంలోచాలా చోట్ల అవినీతి, లంచగొండితం పెరిగిపోయాయి. ముఖ్యంగా సామాన్యుడి జీవితం దుర్భరమైందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఆఫీసులు, మొదలైన చోట్ల లంచాలు ఇవ్వందే ఏ ఒక్కపనిజరగడం లేదని చెప్పుకొవచ్చు. కొంత మంది రాజకీయ నాయకులు సైతం.. ప్రతి దాంట్లో తమకు పర్సంటెజీలు ఇవ్వాలని కూడా డిమాండ్ సైతం చేస్తున్నారు. ఇప్పటికి అనేక చోట్ల.. కొత్తగా ప్రాజెట్లు, వ్యాపారాలు ఏవి స్టార్ట్ చేసిన కూడా అటు ప్రభుత్వానికి, ఇటూ పొలిటిషియన్లకు లంచాలు ఇవ్వందే.. ఏ పనికూడా ముందుకు వెళ్లడంలేదని అందరికి తెలిసిన విషయమే.. అయితే.. గతంలో రతన్ టాటా స్నేహితుడు.. తన ప్రాజెక్ట్ ఆపకుండా ఉండాలంటే.. ఒక పొలిటిషియన్ రూ. 15 కోట్ల డిమాండ్ చేశాడని చెప్పారంట. అదే విధంగా ఆయన.. లంచగొండితనం, అవినితీని దేశంలో.. నిర్మూలించాలంటే.. ఏం చేయాలని టాటాను ప్రశ్నించాడంట. దీనికి సమాధానంగా రతన్ టాటా.. అందరిలో స్వీయ నియత్రణ ఉండాలని చెప్పారంట, అతిగా డబ్బులపై వ్యామోహం ఉండొద్దని కూడా చెప్పారంట. ఈ క్రమంలో రతన్ టాటా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. Read more: Ratan Tata: భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌.. మూడేళ్ల కిందే రతన్‌ టాటా ఏమన్నారో తెలుసా? మరోవైపు.. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. పారిశ్రామిక వేత్త మరణం పట్ల గౌరవ సూచకంగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ రోజు సంతాప దినంగా ప్రకటించారు. మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేయనున్నారు. గురువారం జరగాల్సిన అనేక కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.