TELUGU

Kolkata Murder case: కోల్‌కతాలో మళ్లీ హైటెన్షన్.. 200లు దాటిన సీనియర్ డాక్టర్ల రాజీనామా.. దీదీకి అల్టిమెటం ఇచ్చిన మెడికోలు..

kolkata junior murder rg kar hospital case: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యచారం ఘటన దేశంలో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 9 న చోటు చేసుకున్న ఘటనపై యావత్ దేశం కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనైందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా..ట్రైనీ డాక్టర్ ఘటనపై ఇటీవల సీబీఐ కూడా ఇన్ వెస్టిగేషన్ రిపోర్టు కూడా కోర్టులో సబ్మిట్ చేసింది. జూనియర్ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరగలేదని, కేవలం సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే అత్యాచారం చేశాడని కూడా తన రిపోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు జూనియర్ డాక్టర్ హత్యాచారం తర్వాత.. సీఎం మమతాతో మెడికోలు తమ సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. మెయిన్ గా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులలో భద్రత, అంతే కాకుండా.. ఆర్జీకర్ కేసు దర్యాప్తుపై విషయంలో కొన్ని డిమాండ్ లు ఉంచారు. కానీ మమతా సర్కారు మాత్రం వీటిని పట్టించుకోలేనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఇటీవల కొంత మంది స్టూడెంట్స్ మళ్లీ.. తమ నిరసనలు ప్రారంభించారు. అదే విధంగా దీనికి సంఘీభావంగా సీనియర్ వైద్యులు సైతం.. వారిని కలిసి జూనియర్ వైద్యుల నిరసనలకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామాలు చేసి మమతాకు షాకిచ్చారు.. ఇదిలా ఉండగా.. ఆ తర్వాతమరో 60 మంది వైద్యులు కూడా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు.. కోల్ కతాలో ఆరు ఆస్పత్రుల సీనియర్ వైద్యులు రాజీనామాలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో.. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్న సీనియర్ వైద్యుల సంఖ్య 200 దాటినట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (CNMCH) నుండి 50 మంది సీనియర్ వైద్యులు, NRS మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 34 మంది, స్కూల్ ఆఫ్ మెడిసిన్, సాగూర్ దత్తా హాస్పిటల్ నుండి 30 మంది మరియు జల్పైగురి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 25 మంది సీనియర్ వైద్యులు ఉన్నారు. మరికొందరు కూడా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. Read more: Kolkata murder case: 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా.. కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనలో కీలక పరిణామం.. అంతకుముందు రోజు, కలకత్తా మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 70 మంది సీనియర్ వైద్యులు మరియు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 40 మంది తమ మూకుమ్మడి రాజీనామాలను సమర్పించారు. కోల్ కతాలో మరల ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే మమతా చర్యలు తీసుకొవాలని వైద్యులు దీదీ సర్కారుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.