TELUGU

Puja Khedkar: మహానటి.. అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..

Trainee ias pooja khedkar mock interview video viral: మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ వివాదం దేశంలోనే పెనుదుమారంగా మారింది. ఆమెపై ప్రస్తుతం క్రిమినల్ కేసు, ఫోర్జరీ కేసులు సైతం నమోదయ్యాయి. ఏకంగా యూపీఎస్సీ ఆమెను భవిష్యత్తులు యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ సైతం చేసింది. మరోవైపు పూజా తల్లిదండ్రులు సైతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. పూజా ఖేడ్కర్ ను తొలుత పూణే నగరానికి ట్రైనీగా యూపీఎస్సీ అలాట్ చేసింది. అక్కడ వెళ్లినప్పటి నుంచి ఆమె చేసిన పనులన్ని వివాదాలకు కేరాఫ్ గా మారాయి. ట్రైనీ అయి ఉండి.. కలెక్టర్ మాదిరిగా సదుపాయాలు కావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. కలెక్టర్ లేనప్పుడు ఆయన ఫర్నీచర్ లను, తన గదిలోకి మార్చించుకున్నారు. Interviewer : Can you list "money, power, prestige and career" in priority" Pooja khedkar : pic.twitter.com/DNWEkshkd8 — UPSCyclopedia (@UPSCyclopedia) July 20, 2024 ట్రైనీ గా ఉండగా.. ఒక దొంగను వదిలేయాలని ఏసీపీని సైతం ఒత్తిడి తీసుకొచ్చారు. పూణేలో అక్రమంగా ఇంటి నిర్మాణంచేపట్టారు. ఏకంగా వికంలాంగ సర్టిఫికేట్, ఓబీసీ నకిలీ సర్టిఫికేట్ లను సైతం యూపీఎస్సీకి ఇచ్చారు. అంతేకాకుండా.. ప్రతిదాంట్లో కూడా మోసపూరితంగా ప్రవర్తించారు.ఆమె ఎంబీబీఎస్ లో కూడా తన పేర్లను వేర్వేరుగా చూపించారు. సర్టిఫికేట్ లలో ఇచ్చిన అడ్రస్ కూడా పేక్ గా తెలింది. దీంతో సమగ్రంగా దర్యాప్తు చేసిన అధికారులుకు దిమ్మతిరిగే షాక్ ఎదురైంది. ఈ క్రమంలో ఆమెను యూపీఎస్సీ ముస్సోరికి పిలిపించుకుని ట్రైనింగ్ ను నిలిపేసింది. అంతేకాకుండా.. క్రిమినల్ కేసు కూడా నమోదు చేయించింది. ఈ క్రమంలో తాజాగా, పూజా ఖేడ్కర్ కు చెందిన ఒక మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు.. పూజాఖేడ్కర్ 2022 లో సివిల్స్ ఎగ్జామ్ ను క్లియర్ చేశారు. ఆమె ఆల్ ఇండియాలో 861 ర్యాంక్ సాధించారు. ఇదిలా ఉండగా.. పూజా ఖేడ్కర్ గతంలో పాల్గొన్న మాక్ ఇంటర్వ్యూ కు చెందిన ఒక వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సివిల్స్ సిబ్బంది.. ఫైనల్స్ కు ముందు తరచుగా మాక్ ఇంటర్వ్యూ లు నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో పూజా కూడా.. ఒక మాక్ ఇంటర్వ్యూ సెషన్ లో పాల్గొన్నారు. దీనిలో ఆమె డబ్బు, అధికారం, ప్రతిష్ట, కెరీర్ వీటిలో దేనికి ప్రయారిటీ ఇస్తారు..ఎందుకో చెప్పాలని ఇంటర్వ్యూ ప్యానల్ ఆమెను ప్రశ్నించారు. దీనికి పూజాఖేడ్కర్.. తన జీవితంలో.. కెరీర్, ప్రెస్టేజ్, పవర్ లాస్ట్ ప్రియారిటీగా మనీ అని చెప్పారు. లైఫ్ లో కెరియర్ గ్రోత్ గురించి ఎల్లప్పుడు ఆలోచించాలని అన్నారు. విలువలతో పనిచేయాలిన, అధికారం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని చెప్పుకోచ్చారు. ఇంకా డబ్బు అనేది అసలు ప్రయారీటీ కాదని పూజా అన్నారు. అయితే.. ప్రస్తుతం సీన్ లో మాత్రం.. పూజా మాక్ ఇంటర్వ్యూ లో చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తించారు. అధికారం చెలాయించాలని చూశారు, అక్రమంగా డబ్బులు కూటబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విలువలకు నీళ్లు వదిలేసింది. ఇంకా.. కేవలం తన లైఫ్ , ఫ్యామిలీ మాత్రమే ముఖ్యమన్నట్లు మోసాలకు తెరతీసింది. దీంతో ఈ వీడియోచూసిన వారంతా పూజా ఖేడ్కర్ ను , ఇంతకన్నా.. అబద్ధాలు ఉంటాయా.. మహానటి.. అంటూ కూడా సెటైర్ లు వేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.