TELUGU

5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులే ఇక పనిదినాలు, ఎప్పట్నించంటే

5 Day Week: బ్యాంకు ఉద్యోగులు చాలాకాలంగా రెండు అంశాలపై డిమాండ్ చేస్తున్నారు. ఒకటి జీతాల పెంపు, రెండవది వారానికి 5 రోజుల పనిదినాలు. ఇందులో భాగంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు బ్యాంకు ఉద్యోగులకు ఒప్పందం కూడా జరిగిపోయింది. బహుశా ఈ ఏడాది ఆఖర్లో అమలు కావచ్చని అంచనా ఉంది. చాలా కార్పొరేట్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లానే తమకు కూడా వారానికి ఐదు రోజుల పనిదినాలు కావాలని బ్యాంకు ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల ఈ కోరిక ఈ ఏడాది చివర్లో అమలు కావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగులు, ఐబీఏ మధ్య ఒప్పందం పూర్తయింది. వారంలో రెండ్రోజులు సెలవు లభించనుంది. ఈ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఈ ఏడాది ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వారానికి ఐదు రోజుల పనిదినాలపై ఆమోదం లభించవచ్చు. అంటే డిసెంబర్ 2024 నుంచి బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కావచ్చు. అయితే దీనివల్ల కస్టమర్ల సేవల్లో ఎలాంటి లోపం ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు మధ్యలో 2023 డిసెంబర్ నెలలోనే ఒప్పందం జరిగింది. వారానికి ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదన ఈ ఒప్పందంలో ఉంది. ఆ తరువాత 2024 మార్చ్ 8న జరిగిన ఐబీఏ, బ్యాంకు ఉద్యోగ సంఘాల 9వ జాయింట్ నోట్ ఒప్పందం ప్రకారం వారానికి ఐదు రోజుల పనిదినాల విధివిధానాలు రూపకల్పన చేశారు. ప్రతి శనివారం, ఆదివారం సెలవుండేలా సోమవారం నుంచి శుక్రవారం వరకూ పనిదినాలుండేలా మార్గదర్శకాలు ఖరారయ్యాయి. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవల్సి ఉంది. ఆర్బీఐ కూడా ఈ అంశంపై చర్చించనుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వారానికి ఐదు రోజుల పనిదినాలపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయవచ్చని అంచనా. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఆదివారంతో పాటు శనివారం కూడా అధికారికంగా సెలవుగా ప్రకటిస్తారు. వారానికి ఐదు రోజు పనిదినాలు అమల్లోకి వస్తే బ్యాంకుల పనివేళలు కూడా మారతాయి. రోజుకు 40 నిమిషాల పని సమయం పెరుగుతుంది. అంటే ఇకపై బ్యాంకులు రోజూ ఉదయం 10 గంటలకు కాకుండా 9.45 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 5 గంటలకు కాకుండా 5.30 గంటలకు మూసివేస్తారు. ప్రస్తుతం బ్యాంకులకు ఆదివారాలతో పాటు రెండవ, నాలుగవ శనివారాలు సెలవుంది. ఇకపై మరో రెండు శనివారాలు జత కానున్నాయి. Also read: Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.