TELUGU

Vitamin D: విటమిన్ డి అతిగా తీసుకుంటే గుండె పోటు రావడం ఖాయం.. తస్మాత్ జాగ్రత !!

Vitamin D Supplements Side Effects: శరీరానికి విటమిన్‌ లు ఎంతో అవసరం. ఇవి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారు. దీని కోసం వైద్యులు విటమిన్‌ మందులను ఇస్తుంటారు. అందులో విటమిన్‌ డి ఒకటి. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం విటమిన్‌ డి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే విటమిన్‌ డి సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. అధిక విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడటం, ఎముకల నొప్పి, ఎముకల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ తెలత్తుతాయి. గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్‌ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక స్థితితో కొన్ని మార్పులు కలుగుతాయి. మతిమరుపు వంటి సమస్యలు కలుగుతాయి. వీటితో వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కండరాల బలహీనత వంటి సమస్యలు కలుగుతాయి. అయితే విటమిన్‌ డి శరీరానికి కావాల్సిన అంతగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయు) విటమిన్ డి నెలల తరబడి తీసుకోవడం వల్ల శరీరంలో విషపూరితం అవుతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు 600 ఐయు విటమిన్ డి అవసరం. విటమిన్ డి మోతాదు లక్షణాలు: ఆకలి: విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. దీని వల్ల వికారం, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాల బలహీనత: విటమిన్ డి లోపం కారణంగా కండరాలు బలహీనపడి, అలసట అనిపిస్తుంది. ప్రేగు కదలికలు: విటమిన్‌ డి ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యస్థత దెబ్బతింటుంది. ఇది కాల్షియం కార్బొనేట్ అధికంగా ఉండటం వల్ల ప్రేగు కదలికలకు తగ్గిపోతాయి. గాయాలు: చిన్న గాయాలు కూడా నెమ్మదిగా మానుతుంటే అది విటమిన్ డి మోతాదు సంకేతం కావచ్చు. డిప్రెషన్: విటమిన్ డి మోతాదు మూడ్ స్వింగ్స్, నిరాశ, ఆందోళన మానసిక అస్వస్థతలకు దారితీస్తుంది. కేశాలు రాలడం: విటమిన్ డి మోతాదు కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి, అవి రాలడానికి కారణమవుతుంది. గుండె పోటు: విటమన్‌ డి ఎక్కువగా తినడం వల్ల గుండె నొప్పి కలుగుతుంది. అలాగే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. Also read: Green Tea Tips: గ్రీన్ టీ తాగే అలవాటుందా అయితే ఈ 7 తప్పులు చేయవద్దు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.