TELUGU

Viraaji Trailer Talk: విరాజి ట్రైలర్ టాక్.. వరుణ్ సందేశ్ ఈ సారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడే..!

Viraaji Trailer Talk : మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష డైరెక్షన్ లో మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా 'కొత్త బంగారు లోకం' చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ సస్పెన్స్, హార్రర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు చేయని కొత్త జానర్ లో ఈ సినిమా చేసాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కూడా ఫ్రెష్ గా ఉంది. 1970లో ఒక ఎత్తైన కొండపై మెంటల్ పేషెంట్స్ కోసం నిర్మించిన ఓ భవంతి ఎలా దెయ్యాల కొంపగా మారింది. అందులో ఆత్మలు ఎందుకున్నాయనే కాన్సెప్ట్ బాగుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.