TELUGU

NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వ్యవహారంలో కీలక పరిణామం, మాల్ ప్రాక్టీసుపై కేంద్రం నివేదిక, ఏం జరగనుంది

NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్ష వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగనుంది. నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, మాల్ ప్రాక్టీసు, పేపర్ లీకేజ్ వ్యవహారం నేపధ్యంలో దాఖలైన పలు పిటీషన్లపై జూలై 8న విచారణ జరిపిన సుప్రీంకోర్టు తిరిగి ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కోర్టుకు కొన్ని కీలకమైన విషయాలు వివరించింది. నీట్ యూజీ 2024 ఫలితాలపై సవివరమైన డేటా విశ్లేషణ చేసి మాల్ ప్రాక్టీసుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మద్రాస్ ఐఐటీను కోరింది. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీ అద్యయనం చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. నీట్ యూజీ 2024 పరీక్షలో అనుమానిత కేసుల్ని గుర్తించడం, అత్యుత్తమ పనితీరు కనబర్చిన అభ్యర్ధులు ఎంతమంది ఉన్నారు వంటి వివరాల్ని అంచనా వేసింది. ఈ పరీక్షలో అసాధారణ విషయాలన్ని గుర్తించేందుకు వీలుగా 2023, 2024 టాప్ 140,000 ర్యాంకుల్ని మద్రాస్ ఐఐటీ విశ్లేషించింది. మాల్ ప్రాక్టీసు జరిగినట్టుగా వస్తున్న ఆరోపణల నేపధ్యంలో విద్యార్ధులకు పెద్దమొత్తంలో ప్రయోజనం కలిగిందో లేదో గుర్తించే ప్రయత్నం చేసింది. నీట్ 2024 పరీక్షలో సామూహిక మాల్ ప్రాక్టీసు జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని మద్రాస్ ఐఐటీ అభిప్రాయపడింది. సిలబస్ 25 శాతం తగ్గించడం ఫలితాలపై ప్రభావం చూపించినట్టుగా ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. మద్రాస్ ఐఐటీ నివేదికను ఉదహరిస్తూ నీట్ యూజీ 2024 పరీక్షలో ఎలాంటి సామూహిక మాల్ ప్రాక్టీసు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజ్ ఘటనలో ఇప్పటి వరకూ 47 మంది అనుమానితులే ఉన్నారని వివరించింది. ఈ 47 మందిలో పాట్నాకు చెందిన 17 మంది, గోద్రాకు చెందిన 30 మంది ఉన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు, అక్రమ ప్రయోజనాల ఆరోపణల్ని మద్రాస్ ఐఐటీ నివేదిక కొట్టివేసిందని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నీట్ యూజీ 2024 పరీక్ష కేసును విచారిస్తోంది. లక్షలాదిమంది నిజాయితీ కలిగిన విద్యార్ధుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై తగిన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. నీట్ రీ టెస్ట్ డిమాండ్ ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఎన్టీయే వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా అది చివరి ప్రత్యామ్నాయం కావాలని తెలిపింది. Also read: India Longest Highway: దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది ఎక్కడ్నించి ఎక్కడికో తెలుసా స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.