TELUGU

Malysian Navy Choppers Crash: గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లు..10 మంది దుర్మరణం.. వీడియో వైరల్..

Malaysian Navy Choppers Collide Mid Air During Rehearsal: రాయల్ మలేషియా నేవీ వేడుకల కోసం రిహార్సల్స్ లో ఊహించని ఘటన జరిగింది. రెండు హెలికాప్టర్ లు ఒకదానికి మరోకటి బలంగా ఢీకొన్నాయి. నౌకాదళ స్థావరం ఉన్న మలేషియా పట్టణం లుముట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు హెలికాప్టర్ లు ఒకదానికి మరోకటి క్రాష్ కావడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెరాక్‌లోని లుముట్‌లో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారని పెరాక్ ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ మలేషియా ఫ్రీ ప్రెస్‌కి సంస్థ ధృవీకరించింది. లైవ్ షాకింగ్ విజువల్స్.. గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. 10 మంది మృతి మలేషియాలో మిలిటరీ ప్రదర్శనలో భాగంగా హెలికాప్టర్లతో ఎయిర్ షో నిర్వహించగా.. రెండు మిలిటరీ హెలికాప్టర్లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. pic.twitter.com/J5S0QbbUUm — Telugu Scribe (@TeluguScribe) April 23, 2024 "పెరాక్‌లోని మంజుంగ్‌లోని లుముట్ రాయల్ మలేషియా నేవీ స్టేడియంలో ఈఘటన జరిగింది. హెలికాప్టర్ సంఘటనకు సంబంధించి ఉదయం 9.50 గంటలకు అత్యవసర కాల్‌ రావడంతో డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైందని సంస్థ పేర్కొంది. హెలికాప్టర్ లు రెండు కూడా బలంగా ఒకదానికి మరోకటి బలంగా ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మంటలు,ఆకాశంలో పొగలు అలుముకున్నాయి. పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టినట్లు తెలుస్తోంది. హెలికాప్లర్ ల నుంచి మృతుల మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. HOM (M503-3), Fennec (M502-6) మోడల్స్‌గా గుర్తించబడిన రెండు హెలికాప్టర్లు ఉదయం 9:32 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢీకొని కూలిపోయాయని రాయల్ మలేషియన్ నేవీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3-5 తేదీల మధ్య జరగనున్న నేవీ 90వ వార్షికోత్సవ కార్యక్రమానికి హెలికాప్టర్లు రిహార్సల్ చేస్తున్నాయని వారు తెలిపారు. Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్.. HOM (M503-3) హెలికాప్టర్‌లో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, మిగిలిన ముగ్గురు ఫెన్నెక్ (M502-6)లో ఉన్నారని వారు తెలిపారు. "బాధితులందరూ సంఘటనా స్థలంలో మరణించినట్లు మలేషియా విమానసంస్థ ధృవీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మలేషియా నౌకాదళ అధికారులు ప్రకటించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.