TELUGU

Tax Distributes: పన్నుల వాటా నిధులు: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా.. తెలంగాణకు కోత పెట్టిన కేంద్రం

Taxes And Duties Distribution: సహజసిద్ధంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన నిధులను విడుదల చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగాను.. కొన్ని రాష్ట్రాలకు తక్కువగా విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. పన్నుల ద్వారా అత్యధిక ఆదాయం పంపుతున్న రాష్ట్రాలకు కూడా తక్కువ కేటాయింపులు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధుల్లో భారీగా కోత పెట్టగా.. కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక నిధులు కేటాయించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. Also Read: Haryana: పని చేయని 'హస్తం' అస్త్రాలు.. ఫలితాల వేళ ట్రెండింగ్‌లో జిలేబీ స్వీట్ కేటాయింపులు ఇలా.. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇన్‌స్టాల్మెంట్ రూ.89,086 కోట్లతో కలిపి మొత్తం రూ.1,78,173 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. విడుదల చేసిన నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి లభించగా అనంతరం బిహార్‌ రాష్ట్రానికి దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు అత్యల్పంగా నిధులు లభించాయి. అయితే లభించిన నిధుల్లో ఏపీకి ఎక్కువగా ఉండగా.. తెలంగాణకు చాలా తక్కువ ఉన్నాయి. Also Read: Rahul Gandhi: చెదురుతున్న రాహుల్‌ గాంధీ కల.. తాజా ఫలితాలతో ప్రధానమంత్రి ఆశలు ఆవిరి? ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ.7,211 కోట్లు విడుదల చేయగా.. తెలంగాణకు మాత్రం రూ.3,745 కోట్లు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.31,962 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం బిహార్‌కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,987 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి ఈ నిధులు అందించినట్లు కేంద్రం తెలిపింది. నిధుల్లో వివక్ష.. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో వివక్ష చూపిస్తోందని మరోసారి అర్థమవుతోంది. అత్యధిక ఆదాయం అందిస్తున్న రాష్ట్రాలకు అత్తెసరు నిధులు కేటాయించడం దానికి సాక్ష్యంగా నిలుస్తోంది. రూపాయి పోవడం తప్ప తిరిగి రాని రాష్ట్రాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం వివక్ష కాక మరేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు కేవలం రూ.3 వేల కోట్లు నిధులు విడుదల చేయడం దుమారం రేపుతోంది. పక్క రాష్ట్రం ఏపీకి రూ.7 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం తెలంగాణకు మాత్రం సగం కేటాయింపులు చేయడం చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. కేంద్రం తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.