TELUGU

Brahmamudi: ధాన్యలక్ష్మి పేరు చెబితేనే వణికిపోతున్న కావ్య.. అయ్యయ్యో గుండెనొప్పితో కుప్పకూలిన అమ్మమ్మ..

Brahmamudi Today December 17th Episode: ఓ కుర్రాడికి విద్యాదానం చేస్తూంటే నీ మొగుడి సొమ్ము దోచిపెడుతున్నట్లు చేస్తున్నావ్‌ అంటుంది స్వప్న. మా అత్తకు మతిస్థిమితం లేదు అని కళావతి రూ.5 లక్షలు తీసుకురా అంటాడు. వెళ్లి కావ్య డబ్బు తీసుకువస్తుంది. ఇక అమ్మమ్మ గారు మీ చేతుల మీదుగా ఇవ్వండి అని కావ్య అమ్మమ్మకు ఇస్తుంది. ఇందిరా దేవి ఆ అబ్బాయికి డబ్బు ఇచ్చి ఆశీర్వదిస్తుంది. మీ మేలు జన్మలో మర్చిపోలేము సరైన వారసుడివి అని ఆ పేద కుటుంబం మెచ్చుకుని వెళ్లిపోతారు. దీంతో రుద్రాణీ ఏంటి? నాకు మతిస్థిమితం లేదా? మీకు లేదు అందుకే ఇన్న లక్షలు దానం చేస్తారా? అని నిలదీస్తుంది. దీంతో సుభాష్‌, అపర్ణలు కూడా రుద్రాణీకి కాస్త గడ్డి పెడతారు. ఇందిరా దేవి కూడా నా భర్త కష్టార్జితం ఆయన ఇష్టం అంటుంది. రాహుల్‌ను ఎవరి చదివించారు అని ప్రశ్నిస్తుంది. ఆ కుర్రాడు నీ కొడుకు ఒక్కటే ఆ ఒక్కటి గుర్తుపెట్టుకో అంటుంది. నాన్న నన్ను పరాయిదానిలా ఎప్పుడూ చూడలేదు అంటుంది రుద్రాణీ. ఆయన యావదాస్తి వదిలిపెట్టడానికి ప్రయత్నించినా అందరూ ఆ మాటకు ఎదురు తిరగకూడదు అంటుంది ఇందిరా దేవి. నా కొడుకు మనవళ్లు మళ్లీ సంపాదిస్తారు. ఒక వేళ అదే పరిస్థితి వస్తే రాజ్‌.. ఆయన పేరు నిలబెడతావా? లేదా ? అంటుంది. తాతయ్య మాట నిలబెట్టడం నా బాధ్యత అంటాడు రాజ్‌. ఆయన మాట నిలబెట్టావ్‌, కుటుంబం పరువు కాపాడావు అని మెచ్చుకుంటుంది ఇందిరాదేవి. మరోవైపు ఆసుపత్రి వద్ద కల్యాణ్‌ తాతయ్యను చూస్తు ఉంటాడు. అప్పుడే ఫోన్‌ వస్తుంది. బయటకు వెళ్లి అప్పుతో ఫోన్‌ మాట్లాడతాడు. హలో.. నేను మాట్లాడేది సరస్వతి పుత్రుడితోనేనా? దూరంగా పెళ్లం ఎలా ఉందో? ఏంటో? అని తెలుసుకోవాలని లేదా? ప్రశ్నలు సంధిస్తుంది. ఆలోచిస్తూ ఉంటాడు కవి. ఊరికే అలా అన్నన్రా భయ్ అంటుంది. అదేం లే పొట్టి నువ్వు ఎన్నైనా అనవచ్చు అంటాడు. అది.. ఈ మాట చెబితే బాధ పడుతుంది అని మనసులో అనుకుంటాడు.పక్కనుంచి డాక్టర్.. డాక్టర్‌ అని చప్పుడు వస్తుంది. దీంతో అప్పు కంగారు పడుతుంది. నీకేమైనా అయితే, నేను సంతోషంగా ఉండలేను నీకు ఏమైంది అంటుంది. లిరిక్ రైటర్‌కు ఒంట్లో బాలేదు ఆసుపత్రికి తీసుకువచ్చా అంటాడు. నువ్వు అప్పుడప్పుడు ఫోన్‌ చేయ్ అంటుంది. 'కూచీ ఐ లవ్‌ యూ' అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. కావ్యను సుభాష్‌ రూ.2 లక్షలు తీసుకురా బయటకు వెళ్లాలి అంటాడు వెంటనే తెచ్చి ఇస్తుంది. ఆ తర్వాత ప్రకాశం కూడా వచ్చి కావ్య.. నాకు.. అని మర్చిపోతాడు హ.. గుర్తొచ్చింది నాకు లక్ష కావాలి అంటాడు. ఆగండి తీసుకవస్తా అని తెచ్చి ఇస్తుంది. రాత్రి వంట పూర్తి చేస్తుంటే రాహుల్‌ వచ్చి మనీ కావాలి అంటాడు. ఎంత అని అడుగుతుంది. నీకు ఎంత కావాలి? అంటుంది రూ.50 వేలు కావాలి అంటాడు. ఉదయం మీ అమ్మగారికి ఇచ్చా రూ.2 లక్షలు ఇచ్చా అంటుంది. అది మా అమ్మ ఖర్చు అంటాడు. మా ధాన్యలక్ష్మి పేరు చెప్పమంటవా అంటాడు. వద్దులే తెచ్చిస్తా అని ఇస్తుంది. మా ధాన్యలక్ష్మి పేరు చెప్పగానే భయపడుతుంది అనుకుంటాడు. ఇలా అడిగిన వారికి లక్షలు లక్షలు ఇచ్చకుంటూ పోతే నన్ను లెక్కలు అడుగుతాడు. లాభం లేదు ఆయనకే అప్పజెబుతా అని కాఫీ తీసుకుని బెడ్రూం వెళ్తుంది. అక్కడ రాజ్‌ కాలు జారిన పిల్లిలా అటూఇటూ తిరుగుతూ ఉంటాడు. తాతయ్య ఇచ్చిన మాట అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏవండి.. మీకోసం వేడిగా కాఫీ పెట్టి తీసుకువచ్చా.. అక్కర్లేదు ఇక్కడ అల్రేడీ నా బుర్ర వేడిగా ఉంది అంటాడు. కాఫీ తీసుకుని నాలుగు సిప్‌లు వేయండి అంటే కసురుకుంటాడు. మీ ముక్కు మీద కోపం ఉంటుంది అంటాడు. చిరాకుతో ఇప్పుడు కాఫీ తాగకపోతే నువ్వు కూడా ఎంత ఫైన్‌ వేస్తావు. ఎన్ని లక్షలు కట్టాలి? ఎన్ని కోట్లు కట్టాలి? అంటాడు. ఏమైందండి మీరు బాగానే ఉన్నారా? నేను బాలేను నువ్వు ఏమైనా చేస్తావా? వెళ్లు అని చిరకుగా పంపించేస్తాడు. ఇదీ చదవండి: కళ్లు నెత్తికెక్కిన కావ్య.. పోటీపడి మరీ లక్షల్లో షాపింగ్‌ చేస్తున్న దుగ్గిరాల లేడీస్‌, ఫారీన్‌ చెక్కేసిన నందగోపాల్‌.. బుక్‌ చదువుతున్న అపర్ణకు తాళాలు తెచ్చి ఇస్తుంది. ఇది ఇంటి గౌరవం అంటుంది అపర్ణ. నాకు భారంగా ఉంది. ఈ అర్భకురాలిని క్షమించండి. నేను మాత్రం ఈ తాళాలను తీసుకోను. ఆయన వద్దకు వెళితే కయ్‌ మన్నాడు. ఒక్కక్కరూ వస్తారు.. అందరికీ లక్షల్లనే.. నువ్వెంతా , నీబతుకెంత నీ పుట్టింటి ఆస్తా? ఇనపెట్టే ఖాళీ చేస్తున్నారు అంటుంది. మరుసటి ఎపిసోడ్‌లో ఇంటికి బ్యాంకు వారు వచ్చి వంద కోట్లు షూరిటీ విషయాన్ని చెబుతారు. ధాన్యం రుద్రాణీలు పెద్దాయనపై కేసు వేస్తామని విరుచుకుపడతారు. దీంతో కృంగిపోయిన ఇందిరా దేవికి కూడా గుండెనొప్పి వచ్చి కుప్పకూలుతుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.