TELUGU

US woman flight: ‘థాంక్యూ సర్’ అనడమే ఆమె చేసిన పాపం.. విమానం నుంచి దించేసిన సిబ్బంది.. వీడియో వైరల్..

Us woman alleges she removed from flight for misgendering row: సాధారణంగా మనం కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాస్తంతా టెన్షన్ కు గురౌతుంటాం. ఇక మనతో చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఉంటే ఆ టెన్షన్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు పిల్లలు ఏడుస్తుంటారు. జర్నీలలో పిల్లలను తీసుకెళ్లడం పెద్దవాళ్లకు పెద్దటాస్క్ అని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇక విమాన ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఒక వైపు డొమెస్టిక్, మరోవైపు ఇంటర్నేషన్ అరైవల్స్ తో ఎయిర్ పోర్టు ఫుల్ రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాకు చెందిన ఒక మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. A woman with her 16-month-old son and elderly mother was denied boarding for a United Airlines flight due to her using the 'wrong pronouns' The United employees claimed that to be a 'hate crime,' stressing that the three will not be able to fly with the company anymore, the… pic.twitter.com/9pxMdgiRJU — Sputnik (@SputnikInt) June 27, 2024 అమెరికాలోని ఒక మహిళ తన తల్లి, బిడ్డతో కలిసి విమానంలో ఎక్కడానికి వచ్చింది. అప్పుడు ఆమె ఒక చిన్న పొరపాటు చేసింది. దీని వల్ల సిబ్బంది ఆమెను విమానంలో ఎక్కడానికి పూర్తిగా నిరాకరించారు. ఎంత చెప్పిన కూడా వినిపించుకోలేదు. ఈ వీడియో ఇప్పుడు వార్తలలో నిలిచింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌‌కు చెందిన జెన్నా లాంగోరియా అనే మహిళ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లేందుకు స్థానికంగా ఉన్న విమానాశ్రయానికి వెళ్లింది. విమానం ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఫార్మాలిటీస్ పూర్తవుతున్నాయి. ఇంతలో ఎయిర్ సిబ్బందికి.. సదరు మహిళ ధన్యవాదాలు తెలిపే క్రమంలో జెన్నా కాస్త టెన్షన్ కు గురైంది. మహిళా అటెండెంట్‌ను పురుషుడిగా భావించి ``థాంక్యూ సర్`` అని చెప్పింది. అప్పటి వరకు బాగానే ఉన్న ఎయిర్ సిబ్బంది ఏమైందో కానీ.. ఒక్కసారిగా కోపంతో ఆమెను లోపలికి అలోవ్ చేయలేదు. జెన్నాతో పాటు ఆమె తల్లిని, కుమారుడిని విమానంలోకి వెళ్లకుండా అడ్డుగా నిలబడింది. పిల్లాడు,పెద్దవిడ ఉన్న కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె జెండర్ ను పొరపాటున సర్ అన్నందుకు ఆమె ఈగో హర్ట్ కావడం వల్ల ఇలా చేసినట్లు బాధితురాలు భావించింది. వెంటనే జెన్నా.. ఎయిర్ సిబ్బందిపై ఎయిర్ లైన్స్ లో ఫిర్యాదుచేసింది. అంతేకాకుండా.. తన పోరపాటుకు.. అంటెండెంట్‌కు క్షమాపణ చెప్పేందుకు కూడా ప్రయత్నించింది. అయినా ఆమె వినిపించుకోకుండా విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. తన బాధను జెన్నాఎక్స్ వేదికగా చెప్పుకుంది. ఈ ఘటన వైరల్ గా మారడంతో యూఎస్ ఎయిర్ లైన్ సిబ్బంది దీనిపై స్పందించింది. Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్.. ఎయిర్ లైన్స్ క్లారిటీ.. సదరు మహిళ ఆరోపిస్తున్నట్లు జెండర్ తప్పుగా చెప్పడం వల్ల తమ సిబ్బంది ఆమెను దింపేయలేదని చెప్పుకొచ్చింది. సదరు మహిళ విమానంలో ప్రతి ఒక్క వ్యక్తి వెంట తెచ్చుకొవాల్సిన లగేజీ బరువుకన్న అధిక బరువుతో బ్యాగులు తెచ్చుకొవడం వల్ల తాము దింపేసినట్లు ఎయిర్ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.