TELUGU

Attitude Star Chandra Has: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మరో మూవీ.. 'బరాబర్ ప్రేమిస్తా' టీజర్ లాంచ్

Barabar Premistha Movie Teaser: మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. సంపత్ రుద్ర దర్శకత్వంలో చంద్రహాస్ హీరోగా.. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ బరాబర్ ప్రేమిస్తా. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) విలన్ రోల్ పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం కాగా.. తాజాగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించారు. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో టీజర్‌ను ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. తెలంగాణలోని రుద్రారం అనే గ్రామం బ్యాక్‌డ్రాప్‌గా రూపొందించారు. టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. తన ఫస్ట్ మూవీ రామ్ నగర్ బన్నీ ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయిందన్నారు. తన రెండో సినిమా ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమానే బరాబర్ ప్రేమిస్తా అని.. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు. ఈ మూవీ టీజర్‌ ఇన్‌స్టంట్‌గా అందరికీ నచ్చిందని.. తప్పకుండా వైరల్ అవుతుందన్నారు. యాక్టర్ అర్జున్ మహి మాట్లాడుతూ.. 2018లో ఇష్టంగా సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చానని.. ఆరేళ్ల గ్యాప్‌ తరువాత బరాబర్ ప్రేమిస్తా మూవీలో నటిస్తున్నట్లు చెప్పారు. చిన్న సినిమాగా మొదలైనా.. రోజురోజుకూ స్పాన్‌ను పెంచుకుంటూ పోయారని అన్నారు. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు సెట్‌లో ఉండేవారని.. చంద్రహాస్‌తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు. డైరెక్టర్ సంపత్ రుద్ర మాట్లాడుతూ.. తాను గతంలో ఇష్టంగా, ఏక్ అనే సినిమాలు చేశానని.. మంచి ప్రయత్నంగా వాటికి పేరు వచ్చిందన్నారు. ఓ మంచి ఇంటెన్స్ ప్రేమ కథను అందించాలనే ఉద్దేశంతో బరాబర్ ప్రేమిస్తా మూవీని తీసినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. మరిన్ని వివరాలు ట్రైలర్ లాంఛ్, ఇతర ఈవెంట్స్‌లో వెల్లడిస్తానని తెలిపారు. హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ.. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని.. త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి వస్తామన్నారు. టెక్నికల్ టీమ్ ==> మాటలు- రమేష్ రాయ్ ==> DOP- వైఆర్ శేఖర్ ==> సంగీతం - ఆర్ఆర్ ద్రువన్ ==> ఎడిటర్ - బొంతల నాగేశ్వర రెడ్డి ==> కథ - ఎంఏ తిరుపతి ==> స్క్రీన్ ప్లే - సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి ==> PRO - సాయి సతీష్ ==> నిర్మాతలు - గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ==> దర్శకత్వం - సంపత్ రుద్ర ఆరు పరుగులతో చిత్తు చేసింది. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లోనూ పాక్‌ను భారత్ చిత్తు చేసింది. Also Read: Free Bus Journey: సీనియర్‌ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఎప్పటి నుంచి అంటే? Also Read: Viral Video: గెలికినందుకు పక్కా అనుభవిస్తారు...!.. తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్లు చేసిన వేణు స్వామి.. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.