NEWS

సింగర్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా.. అద్భుతంగా పాడుతున్న బాలిక..

సింగర్స్ ను తలదన్నేలా హిందీ,తెలుగులో అద్భుతంగా పాటలు పాడుతున్న బాలిక..!! టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని నిరూపిస్తుంది కరీంనగర్ కు చెందిన 10 ఏళ్ల బాలిక. చిన్న వయసులోనే తన అద్భుతమైన గాత్రంతో ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బ్లూబెల్ హైస్కూల్ ఆరో తరగతి చదువుతూనే అద్భుతంగా హిందీ, తెలుగులో పాటలు పాడుతుంది. చిన్నతనం నుండే పాటలు, సంగీతం, అంటే ఇష్టం ఉండడం తో కరీంనగర్ లోని మాస్క్ ఇనిస్టిట్యూట్లో సంగీతంతో పాటు, నటన కూడా నేర్చుకుంది. ఇప్పటికే బుల్లితెర వెండితెరపై అద్భుతంగా రాణిస్తున్న ఆద్య ఇప్పుడు తెలుగు హిందీ పాటలతో అద్భుతమైన ప్రదర్శినిస్తుంది. తెలుగు అంటే అందరు పాడే పాటలు కాబట్టి ఇప్పటి నుండి హిందీ లో పాటలు పడుతున్నానని ఆద్య లోకల్ 18కు తెలిపింది. ఈ సందర్భంగా ఆద్య మాట్లాడుతూ.. మమ్మీ నార్త్ ఇండియకు చెందినది, డాడీ సౌత్ ఇండియా కాబట్టి తెలుగు, హిందీ, భాషలలో పాటలు పాడడం నేర్చుకున్నానని చెబుతుంది. స్కూల్స్, పండుగలకు స్టేజ్ పైన పాటలు పాడుతూ ఉంటుంది.. ఇప్పటికి తన నటనతో సీరియల్, సినిమా లొను ఆదరగొడుతోంది. ఇప్పటికే తను ఎక్కడికి వెళ్లినా ఒక సెలబ్రేటీగా చూస్తారని చెబుతుంది. స్కూల్స్ లో తనను అందరూ గుర్తు పట్టి ఇంకా బాగా నటించాలని టీచర్స్ చెబుతున్నారు.. తనకు ఎక్కువగా పేరు తీసుకోచ్చిన డ్రామా జూనియర్స్ సిక్స్ లో తండ్రి తాగి తాగి పెరలాసిస్ తో బాధపడుతుంటే అప్పుడు ఆద్య తన డైలాగ్స్ తో అందరిని మెప్పిస్తుంది.. నాన్న నువ్వు ఇలా చేయకుండా ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని డైలాగ్స్ తో ఎంతో ఫేమస్ ఐంది.. ఇందుకు గాను ఆద్యకు 10వేల రూపాయలు బెస్ట్ ఫార్మెన్స్అవార్డు ను కుడా బాబు మోహన్ చేతుల మీదే అందుకుంది. ఆద్య.. సంగీతంలో కూడా మకుటం లేని మహారాణి ల రాణించాలని మనం కూడా లోకల్ 18 ద్వారా కోరుకునే ప్రయత్నం చేద్దాం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.