NEWS

Acidity: ఎసిడిటీ మిమ్మల్ని వేధిస్తుందా? .. ఈ పనులు మాత్రం అస్సలు చేయకుడదు..!

acidity ఈ రోజుల్లో చాలా మంది వేళకు భోజనం చేయలేకపోతున్నారు. ఆహారపు అలవాట్లు, వేళలు కూడా మారిపోతున్నాయి. ప్రజలు ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారు. రోజంతా సరిపడా ఆహారం తినకుండా రాత్రి వేళల్లోనే ఎక్కువగా తినేస్తుండటం చాలా సమస్యలకు దారి తీస్తోంది. ఉదయం లేవగానే కడుపులో మంట లేదా ఎసిడిటీ (Acidity) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే లేట్ నైట్ డిన్నర్ లేదా నైట్ టైమ్‌లో హెవీ మీల్స్ తినడం మానేయాలి. ఎసిడిటీ ఒక సాధారణ అజీర్తి సమస్య. ఇది వస్తే కడుపు, ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది. తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వదు. మోతాదుకు మించి తినటం, స్పైసీ ఫుడ్ తినడం, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం సైతం ఎసిడిటీకి దారితీస్తాయి. ఒకవేళ ప్రతి ఉదయం ఎసిడిటీతో మేల్కొంటూ ఉంటే? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం. * అరటి పండు ఎసిడిటీ సమస్యకు సులభమైన పరిష్కారం అరటిపండు. ఈ రుచికరమైన పండు ఎసిడిటీని మాయం చేస్తుంది. అరటిపండులోని కొన్ని పదార్థాలు కడుపులోని యాసిడ్స్‌ని తగ్గిస్తాయి. ఇది కడుపుకు ఒక రకమైన నేచురల్ యాంటాసిడ్‌లాగా పనిచేస్తుంది. అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది డైజెషన్‌ను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి పండు స్టమక్ వాల్స్‌పై ఒక రకమైన రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇది కడుపులోని ఆమ్లాలు నేరుగా స్టమక్ వాల్స్‌ను తాకకుండా ఆపుతుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక అరటిపండు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటి ముక్కలను పెరుగులో కలిపి తినవచ్చు. సలాడ్‌లో అరటి ముక్కలను చేర్చి తినవచ్చు. పండిన అరటినే తినాలి. పచ్చి అరటి తింటే స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. * ఉదయం లేవగానే వెచ్చని నీరు తాగాలి ఉదయం లేవగానే ఒక గ్లాసు వెచ్చని నీరు తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్‌ చురుగ్గా పనిచేస్తుంది. ఇది కడుపులోని ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఉదయాన్నే కాఫీ, టీ తాగడం మంచిది కాదు. అలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే కాఫీ, టీలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. కాబట్టి ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగడానికి బదులుగా కొంత సమయం తర్వాత తాగడం మంచిది. * నిద్రవేళకు ముందు భోజనం చేయవద్దు నిద్రవేళకు కనీసం మూడు గంటల ముందు భోజనం చేయాలి. అలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. అలా కాకుండా సరిగ్గా బెడ్ టైమ్‌కు ముందు భోజనం చేస్తే, ఆహారం డైజెస్ట్ కాకుండా కడుపులోనే ఉండి ఎసిడిటీకి కారణమవుతుంది. * మరిన్ని చిట్కాలు అల్లం టీ వంటి హెర్బల్ టీలు కడుపుని శాంతపరుస్తాయి. యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి. బాదం, దోసకాయలు కూడా యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేసి ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలానే ఆహారం నెమ్మదిగా తినాలి. మెత్తగా నమిలి తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అదనంగా కడుపులో యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వదు. ఆహారంలో పెరుగు, మజ్జిగ లేదా ప్రోబయోటిక్స్‌ యాడ్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ఇవి కడుపులో బ్యాక్టీరియాను సమతుల్యం చేసి ఎసిడిటీకి చెక్ పెడతాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.