NEWS

ఈ రంగు క్రాకర్స్ అమ్మితే కఠినమైన చర్యలు తప్పవు

ఈ రంగు క్రాకర్స్ అమ్మితే కఠినమైన చర్యలు తప్పవు ప్రభుత్వ నియమాలు, షరతులను అతిక్రమించి టపాసుల దుకాణం ఏర్పాటు చేసినా, నిషేధిత రసాయనాలతో టపాసులను తయారు చేసి విక్రయించినా, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా చర్యలు ప్రారంభించామన్నారు. బాణాసంచా వంటి పేలుడు పదార్థాలను ఇంట్లో నిల్వ చేయకూడదన్నారు. విస్తరిత ప్రదేశాల్లో ప్రభుత్వ ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలలో మాత్రమే టపాసులు విక్రయించాలన్నారు. ప్రతి టపాసుల షాపులో నీరు, ఇసుక వంటి అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘన చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అక్రమంగా టపాసులు విక్రయించినా, నిల్వ చేసినా డయల్ 112 లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ 94409 00005 కు సమాచారం అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగ సందర్భంగా గతంలో జిల్లాలో చోటుచేసుకున్న అనేక ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని, ఈ ఏడాది టపాసుల విక్రేతలు అనుసరించాల్సిన ప్రత్యేక మార్గదర్శకాలను జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు వివరించారు. దీపావళి పండుగ పూర్వీకుల శుభాశయాలను ప్రతిబింబిస్తూ జరుపుకోవాలని, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలకు సూచనలు: దీపావళి పండుగను అత్యంత ఆనందంతో జరుపుకోవడం అందరికీ ఇష్టం, అయితే ఈ పండుగ ఆనందాలను అపశ్రుతి కలగకుండా, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. టపాసులు కాల్చే ప్రదేశం బహిరంగంగా ఉండాలని, తగిన దూరం పాటించడంతో పాటు, పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని విజ్ఞప్తి చేశారు. టపాసుల విక్రేతలకు మార్గదర్శకాలు: టపాసుల వ్యాపారం చేసే దుకాణదారులు ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉండాలని, నిషేధిత రసాయనాలతో తయారైన టపాసులను విక్రయించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. గ్రీన్ క్రాకర్స్ పేరుతో నిషేధిత టపాసులను అమ్మినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు పొందిన దుకాణదారులు మాత్రమే టపాసుల విక్రయానికి పాల్పడాలని సూచించారు. ఈ దుకాణాలు బహిరంగ ప్రదేశాల్లో సురక్షితంగా ఏర్పాటు చేసుకోవాలి, అలాగే దుకాణాల వద్ద నీరు, ఇసుక వంటి అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రజలకు తగు సూచనలు అందుబాటులో ఉంచేందుకు దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీపావళి వేళ జిల్లాలోని అనుమతులు పొందని గోడౌన్లు, నిల్వ కేంద్రాలు, టపాసుల తయారీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఏ అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీపావళి పండుగకు ముందు నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని, టపాసుల దుకాణదారులు నియమాలకు లోబడిన మార్గదర్శకాలను పాటించాలని, ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.