NEWS

రైతులకు భారీ శుభవార్త.. రెండు రోజుల్లో రైతన్నల ఖాతాల్లోకి రూ. 2,200..

ప్రతీకాత్మక చిత్రం రైతన్నలు పండించిన పంటలకు ప్రభుత్వాలు మద్దతు ధరను కేటాయిస్తూ ఉండేవి. రైతులను దృష్టిలో పెట్టుకొని రైతన్నలు నష్టపోకూడదని ఒక ఆలోచన విధానంతో రైతన్నలు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కేటాయిస్తూ ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం కంటే మధ్య దళారులు కొనుగోలు చేసిధాన్యానికి అధిక రేటును కేటాయిస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో 2023 సంవత్సరంలో రైతన్నలు పండించిన ప్రతి ఒక్క పంటకు ప్రభుత్వాలు మద్దతు ధరలను ఏర్పాటు చేస్తూ ఉండేది. అప్పట్లో మధ్య వ్యాపారస్తుల కంటే ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు, గిట్టుబాటు ధరలు అధికంగా ఉంచేవారు. ప్రస్తుత పరిస్థితులలో అయితే ప్రభుత్వము ఒక క్వింటామొక్కజొన్న కొనుగోలు మద్దతు ధర 2200 కేటాయించింది. మధ్య దళారులు వ్యాపారస్తులందరూ అదే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న సందర్భాలలో రేట్లు మాత్రం అధికంగా ఉంచుతూ రైతన్నల దగ్గర ఉన్న మొక్కజొన్న కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక క్వింటామొక్కజొన్న వచ్చేసి 2500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు మొదట్లో రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతన్నలందరూ ఎక్కువగా ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర కంటే బయటి వ్యాపారస్తులు పెట్టిన ధరకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరను గాలికి వదిలేసి మధ్య వ్యాపారస్తులు ఉన్న వారికి అధిక మొక్కజొన్నలు అమ్మకాలు జరుపుతున్నారు. మధ్య వ్యాపారస్తులకు, ప్రభుత్వం కొనుగోలుకు మధ్య వ్యత్యాసం ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే పూర్తి ఖర్చు ప్రభుత్వమే మోస్తుంది. అంటే మొక్కజొన్న యొక్క కాటా, వాటికి సంబంధించినటువంటి గోనసంచులు ఇలా ప్రతి ఒక్కటి రైతన్నకు భారం కాకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే మోస్తుంది. రైతు దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వము పూర్తి డబ్బును 1 లేదా 2 రోజులలో రైతన్న ఖాతాలో వేస్తుంది. ప్రభుత్వానికి అమ్మినట్లయితే రైతన్న డబ్బులకు పూర్తి బాధ్యత ప్రభుత్వం రాయిస్తుంది. రైతులు ఏ విధంగా నష్టపోకుండాప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉండేది. మధ్య వ్యాపారస్తులు కొనుగోలు చేసినట్లయితే వాటి యొక్క కాటా పూర్తి ఖర్చు, రైతన్నది మొక్కజొన్న కాటావేయడానికి సంబంధించిన గోన సంచులు పూర్తిగా రైతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కొన్ని కొన్ని ప్రాంతాలలో రైతులే భరాయించాల్సి ఉంటుంది. ఆ మధ్య వ్యక్తి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత వారు ఎప్పుడైతే డబ్బులు రైతుకు ఇస్తారో..అప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది.కొన్ని కొన్ని ప్రాంతాలలో రైతన్నకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి.కాబట్టి రైతన్నలు అన్ని విధాలుగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ అధికారి, రబ్బాని లోకల్ 18 ద్వారా తెలియజేశారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.