NEWS

Diwali 2024: ఈ బడ్జెట్ టిప్స్ ఫాలో అయ్యారంటే మీ జీవితానికి తిరుగే ఉండదిక..

Diwali 2024 భారతదేశంలో పండుగలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అందరు కుటుంబ సభ్యులు ఓ చోట చేరి సెలబ్రేట్‌ చేసుకుంటారు. దీంతో సాధారణంగా కుటుంబాల మంత్లీ బడ్జెట్‌ కాస్త పెరుగుతుంది. దీనికి తోడు ఫెస్టివల్ సీజన్‌లో మార్కెట్‌లో స్పెషల్‌ డీల్స్‌, డిస్కౌంట్లు ఊరిస్తుంటాయి. చాలా మంది తెలియకుండానే ఎక్కువ షాపింగ్‌ చేస్తుంటారు, అవసరం లేని వస్తువులు కూడా కొనేస్తుంటారు. దీంతో మంత్లీ బడ్జెట్‌ అదుపు తప్పుతుంది. ఫలితంగా హోమ్‌ లోన్‌ లేదా ఇతర లోన్‌ ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి భారం పెరుగుతుంది. అందుకే ఇలాంటి రుణభారం లేకుండా దీపావళిని ఆస్వాదించేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏవో ‘న్యూస్18’తో చెప్పారు బేసిక్ హోమ్ లోన్ కో-ఫౌండర్‌, సీఈఓ అతుల్ మోంగా. వివరాలు చూద్దాం. క్రెడిట్ కార్డులతో జాగ్రత్త క్రెడిట్ కార్డులు షాపింగ్‌, పేమెంట్స్‌కి కన్వీనియంట్‌గా ఉన్నా, వీటితో ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంటుంది. బిల్‌ పే చేయడానికి ఇంకా సమయం ఉందని అనిపిస్తుంది. ఒకవేళ సమయానికి క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించకపోతే భారీ వడ్డీలు ఎదుర్కోవాలి. మీరు ప్రతి నెలా పూర్తి బ్యాలెన్స్‌ను చెల్లించగలిగితేనే క్రెడిట్ కార్డ్‌ వాడండి. లేదంటే దీని గురించి మర్చిపోండి. బడ్జెట్‌ను సెట్ చేయండి ఖర్చు చేయడానికి ముందు, మీ ఇన్‌కమ్‌, సాధారణ ఖర్చులు, అవసరమైన సేవింగ్స్‌, ఇతర అప్పులకు సంబంధించిన బడ్జెట్‌ను రూపొందించండి. గిఫ్ట్‌లు, డెకరేషన్స్‌, ఉత్సవాల వంటి పండగ అవసరాలకు ప్రత్యేకంగా ఫండ్స్‌ కేటాయించండి. ముఖ్యంగా మీ హోమ్ లోన్ ఈఎంఐ పేమెంట్‌కి డబ్బు పక్కన పెట్టండి. పండుగ అవసరాలకు కేటాయించిన బడ్జెట్‌కి కట్టుబడి ఉండండి. హోమ్ లోన్ పేమెంట్స్‌ మీ హోమ్ లోన్ పేమెంట్స్‌ సకాలంలో చెల్లించేందుకు ప్రయత్నించండి. పేమెంట్స్‌ ఆలస్యమైతే పెనాల్టీలు భరించాల్సి వస్తుంది. వీలైతే మీ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్‌లో కొంత మొత్తం ముందస్తుగా చెల్లించేందుకు ఆలోచించండి. ఇది మీ మొత్తం వడ్డీ భారాన్ని, లోన్ టెన్యూర్‌ను తగ్గిస్తుంది. భవిష్యత్తులో ప్రాపర్టీని అమ్మాలనుకుంటే, లోన్ భారం తీరిపోయి విలువైన ఆస్తిగా మారుతుంది. నిర్లక్ష్యంగా ఖర్చు చేయకూడదు ఏదైనా కొనాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. షాపింగ్ లిస్ట్‌ రాసుకోండి. సడన్‌గా ఏది పడితే అది కొనకూడదు. స్పెండింగ్‌ లిమిట్‌ మైండ్‌లో క్లియర్‌గా ఉంటే, మీ బడ్జెట్‌ను మించి అనవసరమైన కొనుగోళ్లు చేసే అవకాశం చాలా తక్కువ. అవసరాలకు మించిన ఖర్చులు వద్దు ఇక్కడ ‘మీరు ఖర్చు చేసే ముందు బాగా సంపాదించండి’ అనే మాటను గుర్తుంచుకోవాలి. వాస్తవంగా ఎంత అవసరమవుతుందో బడ్జెట్‌ క్రియేట్ చేసుకోండి. ఇతరులను చూసి ఎక్కువగా ఖర్చు చేయాలనే ఆలోచన వదిలేయండి. మీకు అవసరమైన వాటినే, అది కూడా మీ బడ్జెట్ రేంజ్‌లోనే కొనుగోళ్లు చేయాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండటమనేది మీపై, మీ భవిష్యత్తుపై మీరు చేస్తున్న లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. అందుకే మీరు కొనుగోలు చేయగలిగిన వాటిపైన మాత్రమే దృష్టి పెట్టండి, ఆర్థిక లక్ష్యాలను ఎలా అందుకోవాలో ఆలోచించండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.