NEWS

Ayyappa Devotees: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్..

Ayyappa Devotees: మాల వేసిన అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అలాగే భవాని మాలలు, గణేష్ మాలలు, శివమాలలు అంటూ భక్తులు వేలమంది మాలధారణ చేస్తుంటారు. ఇలా మాల‌ధారణ చేసే వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ నిర్వహించాలని నిర్ణయించుకుంది ఆ ట్రస్ట్. మాలధారులందరికీ ఒకే చోట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. 41 రోజుల పాటు, అంటే మండల కాలం పాటు అక్కడ అన్న ప్రసాదం ఉచితంగా వితరణ చేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తితో మాల వేసుకున్న ప్రతి ఒక్క భక్తులు అక్కడికి వెళ్లి అన్న ప్రసాదం ఉచితంగా స్వీకరించవచ్చని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. విశాఖపట్నంలోని వైర్లెస్ కాలనీ శ్రీ కోదండ రామాలయంలోని, శ్రీ హరిహరాత్మజ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో అక్టోబర్ 28న సోమవారం ప్రారంభమైంది. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే డిఆర్ఎం సౌరబ్ ప్రసాద్ ప్రారంభించారు. ప్రత్యేకంగా ఆయన చేతుల మీదుగా స్వాములు, భవానీలు ఇతర దేవతా మాలధారులకి ఆయన అన్న ప్రసాద వితరణ చేశారు. ఇక ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు మండలకాల మహా అన్నప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ హరిహరాత్మజ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పీఠం గురుస్వామి కడగల శ్రీను తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా నిర్విరామంగా దాతల సహకారంతో ఈ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ అయ్యప్పస్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి, దీక్షలో ఉన్న భక్తులకు సుచికరమైన, రుచికరమైన, మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు. ఇక ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశయులు, అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అలాగే భక్తి భావంతో వస్తు రూపేణ గానీ, బియ్యం పప్పుదినుసులు, కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం పేరున అందించి తగిన రసీదు పొందాల్సిందిగా కోరారు. శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కె. కోటేశ్వరరావు, ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు కె సుబ్రహ్మణ్యం, కె శ్రీనివాస్ ఇతర సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతోన్న అన్నదానం కార్యక్రమం పర్యవేక్షణ నిత్యం ఉంటుందని తెలిపారు. ట్రస్టు సభ్యులు కోరాడ అప్పారావు మాట్లాడుతూ ఈ మండలకాలం రోజుకి వెయ్యి నుంచి రెండు వేల మంది వరకూ అన్న ప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. రామకృష్ణారెడ్డి, పాలి అవతార్ స్వామి తదితరులు మాట్లాడుతూ భక్తులు మధ్యాహ్నం 12:30 గంటల నుండి 2:30 గంటల వరకూ రావచ్చని వివరించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.