NEWS

Germany: భారతీయుల వర్క్‌ వీసా కోటా 90,000కి పెంపు.. జర్మనీ వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్!

Germany: ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను నైపుణ్యాల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ఐరోపాలో అతిపెద్ద, ఆర్థికంగా బలమైన జర్మనీలో కూడా ఈ సమస్య నెలకొంది. దీంతో విదేశాల నుంచి, ముఖ్యంగా భారతదేశం నుంచి స్కిల్డ్‌ వర్కర్స్‌ని ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రతిభావంతులైన నిపుణులు జర్మనీకి తరలి వచ్చేలా, వివిధ కీలక ఇండస్ట్రీల్లో పని చేసేలా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. * భారత ప్రొఫెషనల్స్‌కి పెరిగిన వర్క్ వీసాలు ఇటీవల వరకు, జర్మనీ ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది భారతీయులు మాత్రమే దేశంలో పని చేయడానికి అనుమతించింది. ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 90,000కి పెంచింది. ఇది భారత ప్రొఫెషనల్స్‌కి భారీ అవకాశాలు సృష్టిస్తుంది. జర్మనీ శ్రామిక శక్తిలో ఉద్యోగ ఖాళీలను పూరించడానికి ఎక్కువ మందిని ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం జర్మనీలో 70కి పైగా ఇండస్ట్రీలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో ట్రాన్స్‌పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, హెల్త్‌కేర్‌ వంటి కీలక రంగాలు ఉన్నాయి. అలానే ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలోనూ ఉద్యోగుల కొరత నెలకొంది. జర్మనీ కార్మిక మంత్రి, హుబెర్టస్ హీల్ మాట్లాడుతూ, ‘డిమాండ్‌ను తీర్చడానికి జర్మనీకి సంవత్సరానికి 400,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో వర్కర్స్‌ వస్తారని భావిస్తున్నాం. ప్రస్తుతం దాదాపు 137,000 మంది భారతీయులు ఇప్పటికే జర్మనీలో పని చేస్తున్నారు. భారతదేశం, జర్మనీల మధ్య జరిగిన ఒప్పందాలతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.’ అని చెప్పారు. * క్వాలిఫికేషన్‌ ప్రాసెస్‌లో మార్పులు జర్మనీ ఇప్పుడు ఈయూ బ్లూ కార్డ్‌ని కలిగి ఉన్న విదేశీ కార్మికులను వారి అర్హతలు ఆమోదం పొందుతున్నప్పుడు మూడు సంవత్సరాల వరకు దేశంలో ఉండటానికి అనుమతిస్తుంది. ఈ మార్పు నైపుణ్యం కలిగిన నిపుణులు జర్మనీలో స్థిరపడటానికి, అప్రూవల్‌లో ఆలస్యం లేకుండా వారి కెరీర్‌ని ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. * గ్రీన్ సెక్టార్‌లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి జర్మనీ తీవ్రంగా కృషి చేస్తోంది. దేశం 2045 నాటికి గ్రీన్‌హౌస్ గ్యాస్‌ న్యూట్రాలిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, జర్మనీ సౌర శక్తి, పవన శక్తి, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచుతోంది. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్‌ పెరిగింది. ఈ రంగంలో ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులకు అవకాశాలు ఉన్నాయి. * ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంజనీర్లకు డిమాండ్ జర్మనీ దాని ఇంజనీరింగ్, హై-క్వాలిటీ మెషినరీకి ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. విదేశాల్లో పని చేయాలని చూస్తున్న భారతీయ ఇంజనీర్లకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. * జర్మనీ ఐటీ సెక్టార్‌లో అవకాశాలు జర్మనీ ఐటీ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. 2020లో దేశంలో ఒక్క ఐటీలోనే 86,000 ఉద్యోగాలు వచ్చాయి. అర్హత కలిగిన ఐటీ నిపుణులకు మీడియం సైజ్‌ కంపెనీలు, లార్జ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీల్లో జాబ్స్‌ లభిస్తాయి. * నర్సింగ్‌ ప్రొఫెషనల్స్‌కి పెరుగుతున్న డిమాండ్‌ జర్మనీలో లివింగ్‌ స్టాండర్డ్స్‌ ఉన్నతంగా ఉంటాయి. దీంతో ఇక్కడ ప్రజల జీవిత కాలం ఎక్కువగానే ఉంటుంది. వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో నర్సింగ్ ప్రొఫెషనల్స్‌ అవసరం కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మరింత డిమాండ్‌ క్రియేట్‌ అవుతుందని చెబుతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.