NEWS

Aadhaar: ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసే ప్రాసెస్.. ఈ సింపుల్‌ స్టెప్స్ ఫాలో అవ్వండి..!

ప్రతీకాత్మక చిత్రం ప్రస్తుతం దాదాపు అందరికీ ఆధార్‌ కార్డ్‌ ఉంటుంది. మన దేశంలో ఎన్నో రకాల అవసరాలకు ఈ డాక్యుమెంట్ ఉండాల్సిందే. ఆధార్‌ ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా పని చేస్తుంది. ఇందులో పేరు, మొబైల్ నంబర్, అడ్రస్‌ వంటి వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఈ డేటా ఎల్లప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. మీరు కొత్త నగరానికి వెళ్లినా లేదా మీ అడ్రస్‌ మార్చుకున్నా, మీ ఆధార్‌లో ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. లేకపోతే అనవసరమైన సమస్యలు ఎదురవుతాయి. ఆధార్ అడ్రస్ అప్‌డేట్ చేయకపోతే కొన్ని పథకాల ప్రయోజనాలు కోల్పోవచ్చు. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. శుభవార్త ఏంటంటే, మీరు ఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే మీ అడ్రస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్‌ (Aadhaar Update) చేసుకోవచ్చు. మీ ఇంటి నుంచే మీ ఆధార్ అడ్రస్‌ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి. అడ్రస్‌ అప్‌డేట్‌ ఎలా చేయాలి? మీ వద్ద కొత్త అడ్రస్‌కి సంబంధించిన ప్రూఫ్ ఉంటే, మీ ఆధార్ అడ్రస్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే.. - ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ myaadhaar.uidai.gov.in ఓపెన్‌ చేయండి. - మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్‌ అవ్వండి. - పేజీలో డిస్‌ప్లే అయిన క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి, ‘సెండ్‌ ఓటీపీ’పై క్లిక్‌ చేయండి. - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) ఎంటర్‌ చేసి లాగిన్‌ చేయండి. - తదుపరి పేజీలో, ‘అడ్రస్‌’ ఆప్షన్‌ సెలక్ట్ చేసి, ‘ప్రొసీడ్‌ టూ ఆధార్‌ అప్‌డేట్‌’పై క్లిక్ చేయండి. - మీ ప్రస్తుత ఆధార్ అడ్రస్‌ స్క్రీన్‌పై డిస్‌ ప్లే అవుతుంది. - ఇక్కడ మీ కొత్త అడ్రస్‌ వివరాలను ఎంటర్‌ చేయడానికి ఫీల్డ్స్‌ కనిపిస్తాయి. సరైన వివరాలు ఎంటర్‌ చేయండి. - తర్వాత మీ కొత్త అడ్రస్‌ చూపే డాక్యుమెంట్‌ (యుటిలిటీ బిల్లు లేదా రెంటల్‌ అగ్రిమెంట్ వంటివి) అటాచ్ చేయండి. - రెండు చెక్‌బాక్స్‌లు సెలక్ట్ చేసి, ‘నెక్ట్స్‌’ బటన్‌పై క్లిక్ చేయండి. - ఇప్పుడు మీరు కొంత ఫీజు చెల్లించాలి. UPI, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. - పేమెంట్‌ పూర్తయిన తర్వాత, మీ అప్‌డేట్ రిక్వెస్ట్‌కి ప్రూఫ్‌గా రిసీప్ట్‌ పొందుతారు. మీ అడ్రస్ దాదాపు 30 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది. అడ్రస్‌ ఫ్రూఫ్‌ లేకుండా అడ్రస్‌ ఎలా అప్‌డేట్ చేయాలి? మీ వద్ద అడ్రస్‌ ప్రూఫ్‌ లేకపోతే, UIDAI మరొక ఆప్షన్‌ అందిస్తుంది. అదే అడ్రస్‌లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల (కుటుంబ పెద్ద) సహాయంతో ఆన్‌లైన్‌లో మీ అడ్రస్ అప్‌డేట్ చేయవచ్చు. ఇప్పటికే వారి అడ్రస్‌ అప్‌డేట్‌ అయి ఉంటే, వారి అనుమతితో అడ్రస్‌ మార్చుకోవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.