NEWS

Nabhi Chikitsa: బొడ్డు వద్ద నెయ్యి రాస్తున్నారా?.. అయితే ఈ 4 ఆరోగ్య ప్రయోజనాలు మీ చేతిలోనే..!

ప్రస్తుతం చాలా మంది నెయ్యి తినడానికి భయపడుతుంటారు. అయితే మితంగా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా, నెయ్యి (Ghee)కి చాలా ప్రాముఖ్యత ఉంది. అనేక ఆయుర్వేద చికిత్సలో నెయ్యి ఎక్కువగా వాడుతుంటారు. వీటిలో ఒకటి నాభి చికిత్స (Nabhi Chikitsa). నాభి (Belly button) లేదా బొడ్డు అనేది మన శరీరంలోని ఒక ముఖ్యమైన శక్తి కేంద్రం. దీనిపై నెయ్యి రాస్తే శరీరంలోని పిత్త దోషాన్ని బ్యాలెన్స్‌ చేసి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అంతేకాదు నాభిపై కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి స్నానం చేస్తే కూడా ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటోంది. అయితే ఇప్పుడు నాభిపై నెయ్యి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. * చర్మం తేమను నిలుపుకుంటుంది నాభి చుట్టూ వృత్తాకారంలో నెయ్యితో మర్దన చేస్తే, చర్మం తేమను నిలుపుకుంటుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. నాభి శరీరంలోని ఇతర భాగాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి, నాభి చుట్టూ ఉన్న తేమ మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది. పొడి చర్మం ఉన్నవారు లేదా ఎప్పుడూ దాహం వేస్తున్నట్లుగా భావిస్తూ ఉండేవారు నెయ్యిని ఉపయోగించి చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. * మెరుగైన మానసిక ఆరోగ్యం నాభిపై నెయ్యి రాస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ధ్యానం లాంటిది. నెయ్యి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఫలితంగా మరింత సంతోషంగా అనిపిస్తుంది. * ఇన్‌ఫ్లమేషన్ తగ్గుదల నెయ్యిలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉన్నాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. నెయ్యిలో బ్యూటైరేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల ఉబ్బరం, నెలసరి నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. * నిద్రలేమికి చక్కటి పరిష్కారం నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉన్నవారు, నాభిపై నెయ్యి రాసుకోవాలి. నెయ్యి మనసును శాంత పరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ విశ్రాంతి కలిగించే పద్ధతి శరీరాన్ని సమతుల్యం చేసి, త్వరగా, గాఢంగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. * బెల్లీ బటన్‌కు నెయ్యి ఎలా అప్లై చేయాలి - ముందుగా నాణ్యమైన నెయ్యిని ఎంచుకోవాలి. ఆవు నెయ్యి (దేశీ గోవు) మంచిది. ఎందుకంటే ఇది ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. - తర్వాతగోరు వెచ్చటి నీటితో నాభిని శుభ్రం చేసుకోవాలి. ఒక చిన్న చెంచాతో కొంచెం నెయ్యి తీసుకోవాలి. - నెయ్యిని కొంచెం వేడి చేస్తే అది ద్రవంగా మారుతుంది. వెనుకు వాలి, వేలుతో నెయ్యిని నాభిపై పోయాలి. - 15-30 నిమిషాలు ఆ నెయ్యిని అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే మెరుగైన ఫలితం కనిపిస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.