NEWS

Gold: బంగారంపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈ విషయాలు మీకు తెలుసా..?

Gold బంగారం కేవలం అలంకరణ వస్తువులు, ఆభరణాలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక అవసరాలు, భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయి. అనేక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను భవిష్యత్తులో అనిశ్చితుల నుంచి రక్షించుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందేందుకు భారీగా బంగారం నిల్వలను మెయింటెన్‌ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మన దేశీయ బంగారం నిల్వలను రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్‌బీఐ లోకల్‌ రిజర్వ్‌లకు 102 మెట్రిక్ టన్నుల బంగారాన్ని జోడించింది. సెప్టెంబర్ 30 నాటికి ఆర్‌బీఐ మొత్తం 510.46 మెట్రిక్ టన్నులను భారతదేశంలోని వాల్ట్‌లలో నిల్వ చేసున్నట్లు రిపోర్ట్‌ చేసింది. 2024 మార్చి 31 నాటికి 408 మెట్రిక్ టన్నులుగా ఉన్న నిల్వలను భారీగా పెంచింది. మొత్తం బంగారం నిల్వలు ఎంత? కొత్తగా నిల్వ చేసిన డొమెస్టిక్‌ గోల్డ్‌కి మించి, సెంట్రల్ బ్యాంక్ ఆరు నెలల కాలంలో తన మొత్తం బంగారు నిల్వలకు మరో 32 మెట్రిక్ టన్నులను జోడించింది. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రిజర్వ్‌ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన ఆర్‌బీఐ లేటెస్ట్‌ రిపోర్ట్‌లో.. భారతదేశం మొత్తం బంగారు నిల్వలు 854.73 మెట్రిక్ టన్నులుగా పేర్కొంది. స్థానిక వాల్ట్‌లకు తరలుతున్న గోల్డ్‌ గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని విదేశాల నుంచి ముంబై, నాగ్‌పూర్ వంటి ఆర్థిక కేంద్రాల్లోని డొమెస్టిక్‌ వాల్ట్‌లకు తరలిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (FY24), యూకే నుంచి భారతదేశానికి అదనంగా 100 మెట్రిక్ టన్నులు బదిలీ చేసింది. ప్రపంచంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడంతో, తన గోల్డ్‌ అసెట్స్‌పై నియంత్రణ పెంచుకునేందుకు ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంటోంది. 1991 నుంచి ఇదే మొదటిసారి! ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు విదేశాల్లోని వాల్ట్స్‌లో కూడా బంగారం నిల్వలు మెయింటైన్‌ చేస్తుంటాయి. అయితే 1991 నుంచి తొలిసారి ఆర్‌బీఐ విదేశాల్లోని బంగారు నిల్వలను పెద్ద మొత్తంలో స్వదేశానికి తరలించింది. 1991లో భారతదేశం విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని అధిగమించడానికి గణనీయమైన మొత్తంలో బంగారాన్ని తాకట్టు పెట్టింది. ప్రస్తుతం విదేశాల్లో గణనీయమైన బంగారం నిల్వలను కలిగి ఉన్నప్పటికీ, మారుతున్న ప్రపంచ పరిస్థితుల మధ్య భారతదేశం ముందుజాగ్రత్తగా తన ఆస్తులను జాతీయ సరిహద్దుల్లోకి తీసుకువస్తోంది. తాజా సమాచారం ప్రకారం, భారతదేశం తన కొంత బంగారాన్ని విదేశీ సంస్థల వద్దనే ఉంచనుంది. ప్రత్యేకంగా 324.01 మెట్రిక్ టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) కస్టడీలో ఉన్నాయి. అదనంగా 20.26 మెట్రిక్ టన్నుల బంగారం డిపాజిట్లు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల పెట్టుబడి రూపంలో ఉన్నాయి. 2024 మార్చి నాటికి విదేశాల్లో ఆర్‌బీఐ మొత్తం బంగారం నిల్వలు 413.79 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం పాత్ర భారతదేశం విదేశీ మారక నిల్వల్లో భాగంగా బంగారం విలువ 2024 మార్చి చివరి నాటికి 8.15% నుంచి 2024 సెప్టెంబర్ నాటికి 9.32%కి పెరిగింది. ఈ పెరుగుదల బంగారం టన్నుల పెరుగుదల, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. అసెట్ డైవర్సిఫికేషన్ కోసం బంగారం కొనుగోళ్ల చరిత్ర ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (IMF) నుంచి ఆర్‌బీఐ 2009లో 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్‌బీఐ బంగారు నిల్వలు క్రమంగా పెరిగాయి. అప్పటి నుంచి, విదేశీ మారకపు ఆస్తులను విస్తరించే వ్యూహంలో భాగంగా బ్యాంక్ సెకండరీ మార్కెట్ నుంచి అదనపు బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. యూఎస్‌ డాలర్ వంటి ఇతర విదేశీ మారకపు ఆస్తుల విలువలో హెచ్చుతగ్గుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ విధానం భారతదేశానికి సహాయపడుతుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.