NEWS

Tour: ఒక్క జిల్లాలో 7 పుణ్య క్షేత్రాలు.. ఒక్కసారైనా చూడాల్సిందే!

temples రాయలసీమ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ జిల్లా ఏదంటే నంద్యాల జిల్లాగా చెప్పవచ్చు. శ్రీశైలం, మహానంది, ఓంకారం, రుద్రకోటి, సంగమేశ్వరం, కొలను భారతి, యాగంటి వంటి పలు రకాల పుణ్యక్షేత్రాలని రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రాలన్నిటినీ, చలికాలంలో చూసినట్లయితే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరిని పలకరించినట్లుగా ఉంటాయి. ముఖ్యంగా మనం శ్రీశైలం వెళ్లాలంటే అటు నందికొట్కూరు నుంచి, ఆత్మకూరు నుంచి, కర్నూలు డిపో నుంచి పదుల సంఖ్యలో ప్రతిరోజు బస్సుల సౌకర్యం ఉంటుంది. బైక్ పైన మనం శ్రీశైలం వెళ్లేటప్పుడు ముచ్చటగా అడవి ప్రాంతాన్ని వీక్షిస్తూ ప్రయాణాన్ని కొనసాగించవచ్చును. అందులో ముఖ్యంగా చెప్పాలంటే బైక్ లవర్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగించే జర్నీగా శ్రీశైలం చెప్పవచ్చు. శ్రీశైలం వెళ్తున్న రోడ్డు మార్గంలో ఆత్మకూరు దాటిన తర్వాత నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు దూరం వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో సిద్దాపురం మూర్తి జావలి దర్గా ఉంటుంది. అక్కడి నుంచి అదే అడవి మార్గాన వెళ్లినట్లయితే అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అనంతరం అక్కడి నుంచి వెళ్తూ దోర్నాల మీదుగా వెళ్తున్న రోడ్డు మార్గంలో ఇష్ట కామేశ్వరుని దర్శించుకోవచ్చు. అనంతరం సిద్దేశ్వరం, శ్రీశైలం దర్శనాలు చేసుకోవచ్చు. మహానంది: నంద్యాల జిల్లాలో అత్యంత పుణ్యక్షేత్రంగా పిలువబడే పుణ్యక్షేత్రాలలో మహానంది ఒకటి. ఇక్కడ మహానంది పుణ్యక్షేత్రం చుట్టుపక్కల 9 నందులు ప్రత్యేకంగా ఉంటాయి. మహానంది దర్శించుకోవడానికి వెళ్తున్న గుడి గోపురం తర్వాత, నాలుగు కోనేరులు ఉంటాయి. ఆ కోనేరులలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. యాగంటి: యాగంటిలో ఎలాంటి శబ్దాలు లేని చోట స్వామివారిని మనసులో తలుచుకుంటూ దీక్షలో కూర్చున్న సాధువుకు ఒక కాకి తన అరుపులతో ఆ సాధువు దీక్షను భంగం చేసిందంట. దీక్షలో ఉన్న సాధువు యాగంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా కాకి శబ్దం వినిపించకూడదని కాకి జాతికి సాధువు శాపం పెట్టారని పురాణాలు చెబుతుంటాయి. అప్పటినుంచి ఇప్పటివరకు యాగంటి ప్రాంతాల్లో కాకులు ఉండవని భక్తులు చెబుతుంటారు. వాటి శబ్దము ఎక్కడ కూడా వినపడదని చెప్పారు. అదే విధంగా భారతదేశమంతా ఆశ్చర్యపోయే విధంగా యాగంటిలో నంది ప్రతిరోజు పెరుగుతూ వస్తూ ఉంది. ఓంకారం: నల్లమల్ల అడవులలో అత్యంత పుణ్యక్షేత్రంగా ‘‘ఓం’’ అను శబ్దం ఓంకారం నుంచే పుట్టిందని పరమ మహాశివుడు నల్లుల బాధ భరించలేక ఓంకార క్షేత్రంలో దీక్షలో ఉండి ‘‘ఓం’’ అని శబ్దం అక్కడ నుంచే పుట్టిందని పూర్వీకులు తెలుపుతూ ఉంటారు. ఓంకారంలో నిత్య అన్నదానం ఎప్పుడూ ఉంటుంది. సంగమేశ్వరం: ఏడు సప్త నదులు కలిసే ఏకైక ప్రాంతం సంగమేశ్వరంగా చెప్పవచ్చును. ఇక్కడ భీముడు వేప మొద్దుతో పూజకు సమయం అయిందని సంగమేశ్వర ఒడ్డున వేప మొద్దుకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలలో ఆరు నెలలు మంచుతో గుడి పూర్తిగా ఎలాగైతే కప్పబడి ఉంటుందో.. అలాగే సంగమేశ్వరంలో కూడా దాదాపు ఏడు నెలలు పూర్తిగా గుడి నీటిలో మునిగి ఉంటుంది. కొలను భారతి: రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి సరస్వతి దేవి గుడిగా పిలువబడే దేవాలయం కొలను భారతి.. సరస్వతి దేవిగా చెప్పవచ్చును. ఇక్కడ అమ్మవారికి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి కొలను భారతి దేవి చెల్లెలుగా పిలువబడుతూ ఉంది. ప్రతి ఒక్క శివరాత్రికి శ్రీశైలం నుంచి అడవిలో ఉన్న సొరంగం మార్గంలో రథంపైన కొలను భారతి పుణ్యక్షేత్రానికి చేరుకుని, కొలను భారతి సరస్వతి దేవిని శ్రీశైలానికి రథంపై తీసుకెళ్లేవారని అర్చకులు తెలుపుతుంటారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.