NEWS

Spirit: ఇదెక్కడి క్రేజీ అప్‌డేట్‌ మామ.. స్పిరిట్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయిపోయింది..!

ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా రిలీజైన కల్కీ అరివీర భయంకర హిట్టు కొట్టడంతో.. ప్రభాస్ తర్వాత సినిమాలపై చర్చలు జరుగుతున్నాయి. అందులో స్పిరిట్ గురించి ప్రముఖంగా వినిపిస్తుంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనుడంతో ఏ రేంజ్‌లో సినిమా ఉండబోతుందా అని చర్చలు జరుగుతున్నాయి. ఆ మధ్య సెప్టెంబర్ నుంచి స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించబోతున్న సందీప్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా స్పిరిట్ అనేది ఇప్పుడు సింపుల్ వర్డ్‌లా అనిపిస్తుంది కానీ.. ఒక్క సారి సినిమా స్టార్ట్ అయ్యాక టైటిల్‌కు జస్టిఫికేషన్ అనిపిస్తుందని కూడా చెప్పాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా సందీప్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి. హీరోయిన్‌గా రష్మిక మందన్నా, కత్రినా కైఫ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సందీప్ రెడ్డి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తాను వచ్చే నాలుగేళ్ల వరకు స్పిరిట్, యూనిమాల్ పార్క్ సినిమాలపై దృష్టి పెడతానని తెలిపాడు. ఇప్పటికే ప్రభాస్‌తో తీసే స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని, రెండేళ్లలో సినిమాను రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. ఈ లెక్కన 2026లో స్పిరిట్ సినిమా ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేశాడు. స్పిరిట్ తర్వాతే.. యానిమల్ పార్క్ తీస్తానని కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక స్పిరిట్‌‌లో ప్రభాస్ మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి పోలీస్ ఆఫీసర్ అవుతాడట. అంతేకాకుండా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో.. ప్రియురాలు, తండ్రి మీద హీరోకుండే విపరీతమైన ప్రేమను థీమ్‌గా తీసుకున్న సందీప్.. స్పిరిట్ లో మాత్రం దానికి భిన్నంగా డ్యూటీ మీద హద్దులు దాటిన కమిట్మెంట్ ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్రను అలా తీర్చిదిద్దారట. ఇలా డ్యూటీ మీద ఉండే ఎమోషన్‌ను సందీప్ ప్రభాస్‌లో చూపించనున్నాడట. ఈ రూమర్ మాత్రం నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆపగలమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఇంత వరకు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. అందులోనూ మైలురాయిగా చెప్పుకునే పాతికవ సినిమాకు పోలీస్ సబ్జెక్ట్, అది కూడా క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు తీసే సందీప్ అనే సరికి డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని అంచనాలున్నాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.