Traffic Police: 3 ఏళ్లు జైలే.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు! మైనర్లు వెహికల్స్ నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోవచ్చు. అవయవాలు కోల్పోవచ్చు. ఎదుటి వారు వారి జీవనాధారాన్ని కోల్పోవచ్చు. మైనర్స్ వెహికల్స్ నడిపి ఆక్సిడెంట్స్ చేస్తే వారి తల్లిదండ్రులకు గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని నిజామాబాద్ డీటీఓ ఉమా మహేశ్వర్ రావు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్ యూజర్స్ కి ఆవగాహన కల్పిస్తున్నామని నిజామాబాద్ డీటీఓ ఉమామహేశ్వర్ తెలిపారు. స్కూల్స్, కాలేజెస్, డ్రైవర్స్, ప్రజలకు ఇలా అన్ని వర్గాల వారికి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాము. ముఖ్యంగా మైనర్స్ కి తల్లిదండ్రులు ఎక్కువగా వెహికల్స్ ఇస్తున్నారు. మైనర్లు వెహికల్ నడిపితే ప్రమాదం జరిగితే తల్లిదండ్రులకు మూడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఆ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వెహికల్స్ నడపాలి. లైసెన్స్ లేని వారు వెహికల్స్ నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే వెహికల్స్ ఓనర్స్ కే ప్రధాన సమస్య. కానీ వెహికల్స్ 16 సంవత్సరాల పిల్లలు, 14 సంవత్సరాల పిల్లలు నడుపుతున్నారు. నడపడం అనేది పెద్ద విషయం కాదు. నడపడం వస్తుంది కానీ కావాల్సిన సమయంలో వారిలో స్పందించే గుణం గాని, అనుభవం గాని వారిలో కనిపించదు. అంతా మెచ్యూర్ గా ఉండరు. సరైన సమయంలో కరెక్ట్ గా స్పందించకపోతే ఆక్సిడెంట్లు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో అతనికి ప్రమాదం ఉంటుంది. ఎదురుగా వచ్చే పాదచారులకు గాని, రోడ్ యూజర్స్ గాని అందరికీ ప్రమాదమే జరుగుతుంది. ప్రాణాలు కోల్పోవడం గాని లేదా అవయవాలు కోల్పోవడం గాని జరుగుతుంది. ఈ మధ్య ఓ తల్లి మైనర్ అయిన కొడుకుకి బండి ఇచ్చింది. 16 సంవత్సరాల కుర్రాడు బండితో వృద్ధున్ని ఢీకొట్టాడు. దీంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుని తల్లిపై కేసు బుక్ అయింది. ఇలా చాలా జరుగుతున్నాయి. మైనర్స్ ఎక్కువగా వెహికల్స్ తీసుకుని తిరుగుతున్నారు. కాబట్టి మేము ప్రజలను కోరేది ఏంటంటే. 18 సంవత్సరాలు నిండకుండా తక్కువ ఉన్నటువంటి మైనర్లకు బండి ఇవ్వకూడదు. మైనర్లకు బండి ఇవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బండి ఓనర్స్ దే బాధ్యత. ఇలాంటి కేసుల్లో మూడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. శిక్ష కంటే కూడా ఈ ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. అవయవాలు కోల్పోవచ్చు. ఇంకేమైనా జరగవచ్చు. ఎదుటి వారికి కూడా ప్రమాదం జరిగి జీవనాధారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి ప్రజలను మేము కోరేది లైసెన్స్ తీసుకోండి. వాహనం నడపడంలో శిక్షణ తీసుకుని రోడ్డుపై వెహికల్ నడపడం అందరికీ మంచిదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వెహికల్ ఇవ్వకూడదని డీటీఓ వివరించారు. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.