NEWS

Job Mela: 18 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్.. నెల నెలా రూ.20 వేలు, పరీక్ష లేకుండా జాబ్ కొట్టండిలా!

job mela ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీకాకుళం సెంట్రల్ వారు జనవరి ఏడవ తేదీన శ్రీకాకుళం పట్టణంలోని బలగ దగ్గర ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో రెండు కంపెనీలు వస్తున్నాయి. సుమారుగా 75 ఉద్యోగాలు జాబ్ మేళా ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఎస్ఎస్ జువెలరీ కంపెనీ వాళ్ళు 50 సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ కూడా శ్రీకాకుళంలోనే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ. వయసు 18 నుండి 30 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులను ఎస్ఎస్ జ్యువెలరీ కంపెనీ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో రిక్రూట్ చేయనున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి 12000 వేల రూపాయలు నుంచి 20,000 వేల రూపాయలు మధ్య ప్రారంభ జీతం ఉంటుంది. ఫ్యూజన్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వారు 25 ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియట్ ఆ పైన చదువుకున్న యువతీ యువకులు అర్హులు. జాబ్ రోల్ రిలేషన్షిప్ ఆఫీసర్. వర్క్ లొకేషన్ శ్రీకాకుళం, రాజాం, అనకాపల్లి, పెందుర్తి, నర్సీపట్నం, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగానికి అర్హత 21 సంవత్సరం నుంచి 34 సంవత్సరాలు వరకు. జీతం 12,500 రూపాయలు నుంచి 15 వేల రూపాయలు వరకు ఉంటుంది. జనవరి 7వ తేదీన శ్రీకాకుళం గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో జరగబోయే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఈ వెబ్సైట్లో ( ) వారి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ జాబ్ మేళాకు వచ్చే విద్యార్థులందరూ తప్పకుండా బయోడేటా, ఆధార్ కార్డు, టెన్త్, డిగ్రీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ కోసం అప్లై చేసుకున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకొని హాజరవ్వాల్సిందిగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే 99125 57054, 78934 54256 నెంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.