భక్తులు అడిగిన వరాలిస్తున్న స్వయంభు వెలిసిన మానస దేవి..ఆలయ విశిష్టత ఇదే..!! 800సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాశింపేట గ్రామంలో స్వయంభూ మానస దేవి మహా క్షేత్రం వెలిసింది. ఈ ఆలయం భారతదేశంలో రెండవ శ్వయంభు మానస దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మొదటిది హరిద్వార్‌లో ఉండగా, రెండవది మానస దేవి ఆలయం కరీంనగర్ జిల్లా, కాశింపేట గ్రామంలో కొలువై ఉంది. మానసా దేవి మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనసారా భక్తుల కోరికలు కోరితే తీరుస్తుందని నమ్ముతారు. పూర్వం ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉండేది. విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారని, వీరభద్ర స్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసా దేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు 108 నాగ విగ్రహాలు, నాగేంద్రస్వామి విగ్రహాలు ఉండటం విశేషం. సర్పదోషం వున్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుతే సంతాన భాగ్యం కలుగుతుంది.. అలాగే రైతులకు ఎప్పుడు కూడా ఇక్కడ అకాల వర్షాలు కురవలేదు.. ఇక్కడ ఎప్పుడు పంటలు సమృద్ధిగా పండుతాయాయి..ఇక్కడ ఇంకో విశిష్టటత ఏంటంటే వంద రూపాయలు పెట్టి మూడుపు కడితే కోటి రూపాయల మొక్కు కూడా నెరవేరుతుందని ఆలయ కమిటీ చైర్మన్ మల్లరెడ్డి లోకల్ 18కి తెలిపారు. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు నిత్యం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు.. అలాగే ఫ్రీ పార్కింగ్, ఫ్రీ దర్శనం కూడ ఉంటుంది.. ఎవరికైనా ప్రత్యేక దర్శనం కావాలంటే వంద రూపాయలు టికెట్ మాత్రమే తీసుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఆలయాన్ని నిర్మించడానికి తొమ్మిది నెలల ఒక్కరోజు పట్టింది అని అన్నారు.. గర్భస్థములు శిశువు తొమ్మిది రోజులు ఎలా ఉంటుందో.. ఇక్కడ కూడా అమ్మవారు కరెక్ట్ తొమ్మిది నెలల తర్వాత భక్తులకు దర్శనం ఇచ్చారని వివరించారు. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.