ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి రిటర్న్స్, ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయగల అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్లు మార్కెట్‌తో లింక్ అయి ఉంటాయి. కానీ షేర్ మార్కెట్‌లో పోలిస్తే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్‌లను క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు, కాబట్టి నష్టపోయే అవకాశాలు తక్కువ. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే.. మీకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సిప్ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం బాగా పాపులర్ అయింది. ప్రజలకు చిన్న, సాధారణ పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది. ఇటీవల దేశంలో సిప్ పెట్టుబడులు రూ.17,000 కోట్లను అధిగమించడం గమనార్హం. అయితే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనుకుంటే, టాప్-అప్ సిప్ బెస్ట్ ఆప్షన్. సాధారణ SIPతో పోలిస్తే ఈ పద్ధతి మీ కార్పస్‌ని రెట్టింపు చేయగలదు. ఇదెలా పని చేస్తుందో, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. సిప్ వర్సెస్ టాప్-అప్ సిప్ రెగ్యులర్ సిప్‌లో నెలవారీ లేదా త్రైమాసికంలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించే శక్తి ఉన్న వాళ్లకి ఈ ఆప్షన్ అనుకూలంగా ఉంటుంది. అదే టాప్-అప్ సిప్ ద్వారా ప్రతి సంవత్సరం మీ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌ని పెంచుకోవచ్చు. మీ జీతం పెరుగుతున్న కొద్దీ, మీరు సిప్ అమౌంట్‌ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాంపౌండింగ్ పవర్‌తో కాలక్రమేణా భారీ రిటర్న్స్ పొందుతారు. కాలక్రమేణా తమ ఆదాయాలు పెరుగుతాయని ఆశించే లేదా తమ పెట్టుబడులను వేగవంతం చేయాలనుకునే వారికి ఈ ఆప్షన్ సూట్ అవుతుంది. ఉదాహరణకు రెగ్యుర్ సిప్ కాలిక్యులేషన్ ఇలా.. మంత్లీ సిప్: రూ.10,000 టెన్యూర్: 20 సంవత్సరాలు అంచనా వేసిన రాబడి: 12% మొత్తం పెట్టుబడి: రూ.24 లక్షలు 20 సంవత్సరాల తర్వాత సిప్ విలువ: రూ.99.91 లక్షలు అంచనా వేసిన లాభం: రూ.75.91 లక్షలు టాప్-అప్ సిప్ కాలిక్యులేషన్: మంత్లీ సిప్ (ప్రారంభం): రూ.10,000 టెన్యూర్: 20 సంవత్సరాలు అంచనా వేసిన రాబడి: 12% ప్రతి సంవత్సరం సిప్ టాప్-అప్: 10% మొత్తం పెట్టుబడి: రూ.68.73 లక్షలు 20 సంవత్సరాల తర్వాత సిప్ విలువ: ₹1.99 కోట్లు అంచనా లాభం: రూ.1.30 కోట్లు టాప్-అప్ SIP ఎందుకు ఎంచుకోవాలి? కాంపౌండింగ్ ప్రయోజనాలు: ప్రతి సంవత్సరం మీ సిప్ అమౌంట్‌ని పెంచడం వలన కాంపౌంగింగ్ పవర్ పెరుగుతుంది. అధిక రాబడిని అందిస్తుంది. లక్ష్యాలు నెరవేరుతాయి: ప్రతి సంవత్సరం పెట్టుబడి పెంచడంతో, మీరు రెగ్యులర్ సిప్ కంటే త్వరగా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. ఆదాయ వృద్ధి: మీ జీతం పెరిగేకొద్దీ, భవిష్యత్తు కోసం పొదుపు చేసే సామర్థ్యం పెరుగుతుంది. మరింత పెట్టుబడి పెడుతూ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయవచ్చు. నిపుణుల సలహా ఆర్థిక సలహాదారు అమిత్ నిగమ్ ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్’తో మాట్లాడుతూ, ‘దీర్ఘకాలిక సంపదను నిర్మించడానికి సిప్‌లు సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. ప్రత్యేకించి టాప్-అప్ సిప్‌లు సంపద సృష్టి ప్రక్రియను సులభతరం చేస్తాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఈ స్ట్రాటజీ ఊహించని లాభాలు ఇస్తుంది. కాలక్రమేణా మీ కార్పస్‌ను గణనీయంగా పెంచుకోవడంలో సహాయపడుతుంది.’ అని చెప్పారు. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.