NEWS

కల్తీ లేని హెల్దీ ఎద్దు గానుగ నూనె వ్యాపారంలో.. రాణిస్తున్న దంపతులు..!

కల్తీ లేని హెల్దీ ఎద్దు గానుగ నూనె వ్యాపారంలో రాణిస్తున్న దంపతులు..!! శ్రీకాకుళం కు చెందిన ఆర్మీ ఉద్యోగి నాణ్యమైన వంట నూనె కోసం.. స్థానికంగా వెతకగా అతనికి అంచనాలకు తగ్గ మంచి నూనె ఎక్కడా లభించలేదు. దీంతో వారి ఇంటి అవసరాలకు కోసం మొదటిగా ప్రారంభించిన ఎద్దు గానుగ ఈ రోజు వారి సతీమణి నాణ్యమైన వంట నూనెలు కావాలి అనుకొనే తన లాంటివారి కోసం వారే స్వయంగా.. నూనెతీసి పంపిస్తూమరి కొందరి ఆరోగ్యాన్ని కాపాడటం మాకు ఎంతో హాయిగా ఉందని అంటున్నారు. మరి ఈ జంట గురించి మన లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం పట్టణం నుండి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న జొన్నలపాడు గ్రామంలో ఉన్న రమేష్ 2022 సంవత్సరంలోజూన్ నెలలో వారి కుటుంబం అవసరాలు కోసమని చిత్తూరు జిల్లాలని పెద్ద తవనం పల్లి గ్రామం నుండి గానుకను తీసుకు వచ్చారు. ఆ సమయంలో గానుగ అక్కడి నుండి కొని తీసుకు రావడానికి సుమారుగా లక్షల అరవై వేలు రూపాయలు ఖర్చు కాగ గానుగ తిప్పేందుకు ఎద్దు భీముడిని శ్రీ కాళహస్తి నుండి తీసుకు రావడం జరిగింది. గానుగ అదేందుకు దేశవాలి ఎద్దు మాత్రమే మంచిగా తిరుగుతాయి అని రమేష్ లోకల్ 18 కు వివరించారు. రమేష్ వృత్తి రీత్య ఆర్మీలోసోల్జర్ గా పని చేస్తున్నారు. వారి సతీమణి నీలిమ పిల్లలను చూసుకుంటు జొన్నలపాడు గ్రామంలో ఉంటు ఈ ఎద్దు గానుగ వ్యాపారం చేస్తున్నది. రమేష్ ప్రకృతి వ్యవసాయం పైన మక్కువతో తనకు ఉన్న పొలంలో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా పంటలు పండిస్తున్నారు. వాటినే వారి కుటుంబం ఆహారంగా తీసుకొనేవారు కానీ వారి ఆహారంలో వాడే ఈ నూనె కూడా స్వచ్ఛమైనది. పాత పద్ధతులు ద్వారా తీసే గానుగ నూనె వివిధ ప్రాంతాలు నుండి తెప్పించి వాడేవారు. కానీ ఆయనకు అవి ఆత్మ సంతృప్తి ఇవ్వలేదు. బయట ఎద్దు గానుగ నూనె అని లీటర్ 300 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ గానుగలో 12కేజీల వేరుశెనగలు వేస్తే సుమారుగా ఐదు లీటర్ల్ నూనె వస్తుంది. ఇందులో అటువంటి కొన్న ధరకు నూనె ఎలా ఇస్తున్నారు అనేది ఆయనకు అర్ధంకాని ప్రశ్శ కాగా.. కల్తీ లేనిదే అంత తక్కువకు ఇవ్వ లేరు అని ఆయన కల్తీ లేని నూనె వాడెందుకు ప్రారంభించిన తనలాంటి వారికోసం వేద నేచరల్స్ ఎద్దు గానుగ నూనెలు వ్యాపారం ప్రారంభించనట్లు ఆయనసతీమణి నీలిమ సహకారంతో మొదట తనకు తెలిసిన ప్రకృతి వ్యవసాయా మిత్రులకు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రస్తుతం నెలకు 60 లీటర్లనూనె తన కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. లీటరు నూనె ఖరీదు 550 రూపాయలు. వీరి దగ్గర కొబ్బరి, వేరుశనగ, పప్పు, నువ్వులు, నల్ల నువ్వులు, ఆవాలు, కుసుమలు, వెర్రి నువ్వులు, అవిస గింజలనూనెలు వీటి దగ్గర లభిస్తున్నాయని నీలిమ లోకల్ 18 కు వివరించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.