NEWS

Hyderabad Metro Phase-2: హైదరాబాద్ రెండో దశ మెట్రోపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన నిర్ణయం?

Hyderabad Metro Phase-2: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కీలకమైన అడుగులు పడ్డాయి. ఎంజీబీఎస్ - చంద్రాయణ్ గుట్ట మార్గంలో ప్రభావిత 34 ఆస్తులకు సంబంధించిన 41 మంది యజమానులకు రు. 20 కోట్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఈ రోజు చెల్లించింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, హెచ్ఏఎంఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిసెట్టి పాల్గొన్నారు. పాతనగరంలో మెట్రో రైల్ నిర్మాణం కోసం ఆస్తులు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సముచితమైన రీతిలో నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నామని, ఈ ప్రక్రియలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచనలను పరిగణలోకి తీసుకున్నామని మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మొదటి దశ కన్నా మరిన్ని సౌకర్యాలతో రెండో దశ నిర్మాణం చేపట్టనున్నామని, దీనిలో పాతనగరం రూపురేఖలు మరనున్నాయని అన్నారు. ఎంపీ సూచనల మేరకు మెట్రో స్టేషన్ల నుండి చార్మినార్, లాడ్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలకు స్కై వాక్, ఫుట్ పాత్ మొదలైన అధునాతన సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు. పాతనగరం ఇంకా అభివృద్ధి జరగాలని సీఎం గారి ఆకాంక్ష అని, అందుకు తగ్గట్టుగా మెట్రోను పాతనగర వాసులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. మొత్తం రు.2,741 కోట్ల అంచనా వ్యయంతో ఏడున్నర కిలోమీటర్ల పాతనగరం మెట్రోను నాలుగేళ్లలో పూర్తి చేయాలన్న సీఎం గారి సంకల్పాన్ని నెరవేర్చడానికి సన్నద్ధం అయ్యామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నాంపల్లి లో అధునాతన మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు కూడా వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇది కూడా పాతనగర అభివృద్ధికి ముఖద్వారం అవుతుందని ఆయన వెల్లడించారు. ఎంపీ శ్రీ ఒవైసీ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఓల్డ్ సిటీ వాసులు ఎదురు చూస్తున్న మెట్రో రైల్ ఇప్పుడు ఆచరణలోకి రావడం ప్రశంసనీయమని, ఇందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలని అన్నారు. మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి చేస్తున్న కృషికి తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపాదిత మీరాలంమండీ, చార్మినార్ స్టేషన్ల వద్ద స్కై వాక్ లను నిర్మిస్తే పర్యాటక పరంగానే కాకుండా స్థానికులకు కూడా సౌలభ్యంగా ఉంటుందని ఆయన సూచించారు. నిర్వాసితులకు, రాబోయే మెట్రో స్టేషన్ల వద్ద వ్యాపారాలు పెట్టుకోడానికి తగు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా మెట్రో ఎండీకి శ్రీ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీ దురిసెట్టి అనుదీప్ మాట్లాడుతూ.. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ముందుకు వచ్చిన నిర్వాసితులకు లాభదాయకమైన నష్టపరిహారాన్ని నిర్ణయించామని, దీనిని అందరు ఆహ్వానించారని అన్నారు. మొత్తం 1100 ఆస్తులకు సుమారు రు.1,000 కోట్ల నష్టపరిహారం చెల్లించనున్నామని, ఇందుకు స్థానికులు తమకు పూర్తిగా సహకరిస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. మెట్రో రైల్ భూ సేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి కే.స్వర్ణలత కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.