భారత్‌లో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో నోటి క్యాన్సర్ (Oral Cancer) ఒకటి. గొంతు, పెదవులు, నాలుక సహా నోట్లో ఎక్కడ వచ్చినా దాన్ని నోటి క్యాన్సర్ కిందే పరిగణిస్తారు. ఈ కేసులు మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా దాదాపు లక్ష మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. ప్రతి లక్ష క్యాన్సర్ కేసుల్లో 19 మందిలో దీన్ని గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వంటి వివరాలు చూద్దాం. ఓరల్ క్యాన్సర్ లక్షణాలు పెదవులు, నాలుక, చెంపలు, నోటి కింది భాగం, పై భాగం, మృదువుగా ఉండే కణజాలం, గొంతు.. ఈ భాగాల్లో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా సరే, దాన్ని నోటి క్యాన్సర్‌గా (Oral Cancer) వ్యవహరిస్తారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అన్ని క్యాన్సర్లలాగే ఇది కూడా ప్రాణాంతకం. కానీ, తొందరగా గుర్తించి చికిత్స అందిస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓరల్ క్యాన్సర్ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఫలితంగా దీన్ని అంత తొందరగా గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. కొందరిలో మాత్రం ఈ కింది లక్షణాలు కనిపిస్తుంటాయి. - నోట్లో ఎప్పుడూ మానని పుండ్లు - నిరంతర నొప్పి - నోరు, పెదాల్లో తిమ్మిరి - చిగుళ్లు, నాలుక, నోట్లో ఎర్రటి లేదా తెల్లటి మచ్చలు - నమలడం, మింగడం, మాట్లాడటానికి ఇబ్బంది - మాటలో మార్పు - నోట్లో అకస్మాత్తుగా రక్తస్రావం - పళ్లు వదులుకావడం - దవడల్లో వాపు ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అది కచ్చితంగా నోటి క్యాన్సర్ (Oral Cancer) అని నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు. ఇతర సమస్యల వల్ల కూడా ఇవి కనిపించవచ్చు. అయినప్పటికీ డాక్టర్‌ను సంప్రదించాలి. కారణాలివే..! - గుట్కా, పాన్ మసాలా, జర్దా వంటివి తినే వారికి నోటి క్యాన్సర్ వస్తుంది. - పొగ తాగడం, పొగాకు పదార్థాల వాడకం కూడా దీనికి కారణం. - అతిగా ఆల్కహాల్ తాగేవారికి కూడా, మందుతో పాటు స్మోక్ చేసేవారికి నోటి క్యాన్సర్ రిస్క్ మరీ ఎక్కువ. - హ్యూమన్ పాపిలోమావైరస్‌లోని కొన్ని స్ట్రెయిన్స్ వల్ల నోటి క్యాన్సర్లు వస్తుంటాయి. - ఎక్కువ సమయం పాటు ఎండలో ఉండడం వల్ల పెదాలపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. - పళ్లు సరిగా తోమకపోవడం, ఓరల్ హైజీన్ లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. - వయసు పెరుగుతున్న కొద్దీ ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మలి వయసులో పొగాకు, ఆల్కహాల్ వంటి వాటికి దూరం కాకపోతే ముప్పు మరింత ఎక్కువవుతుంది. - జన్యువుల పరివర్తనాల వల్ల కూడా కొంత మందిలో నోటి క్యాన్సర్లను గుర్తించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునో థెరపీ వంటి పద్ధతుల్లో నోటి క్యాన్సర్‌కు (Oral Cancer) చికిత్స అందిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే తొందరగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాధి ముదిరితే మాత్రం, చికిత్స పనిచేయక ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.