NEWS

PLI scheme: 2025 బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ తయారీపై ఫోకస్‌.. రూ.25,000 కోట్ల పీఎల్‌ఐ స్కీమ్‌కి ఆమోదం?

దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను పెంచడానికి 14 రంగాలను కవర్ చేసే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్స్ తీసుకొచ్చింది. తాజాగా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని పెంచడానికి రూ.25,000 కోట్ల వ్యయంతో పీఎల్‌ఐ స్కీమ్‌కి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కొన్ని నివేదికల ప్రకారం, కేబినెట్ నుంచి తుది ఆమోదం పొందిన తర్వాత, ఈ పథకాన్ని 2025 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. పీఎల్‌ఐ స్కీమ్‌ లక్ష్యం ఏంటి? కొత్త PLI పథకం ప్రధాన లక్ష్యం దేశంలో కీలకమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌ తయారీని పెంచడం.. ఇదే సమయంలో విదేశీ దిగుమతులపై, ముఖ్యంగా చైనాపై ఆధారడటం తగ్గించడం. మొత్తంగా భారతదేశ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎకోసిస్టమ్‌ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. ఈ పథకం కింద కవర్ చేసిన కీలక కాంపోనెంట్స్‌లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBs), బ్యాటరీలు, డిస్ప్లే యూనిట్లు, కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమం స్థానిక తయారీదారులను ఈ భాగాలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం భారతదేశం స్థానిక సరఫరా గొలుసును మరింతగా పెంచుతుంది. PLI స్కీమ్‌ ఎందుకు కీలకం? కొన్నేళ్లలో దేశ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్‌ మంచి వృద్ధిని సాధించింది. గత ఆరు సంవత్సరాల్లో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రధాన పాత్ర పోషిస్తూ 2024లో $115 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి యాపిల్, శాంసంగ్ వంటి బడా కంపెనీలు సహకరించాయి. PLI స్కీమ్‌పై అంచనాలు ఏంటి? డొమెస్టిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌: PCBలు, డిస్ప్లేలు వంటి కాంపోనెంట్స్‌ తయారీని ప్రోత్సహిస్తుంది. పెట్టుబడులు: భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తుంది. దిగుమతుల తగ్గింపు: చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఉపాధి కల్పన: తయారీ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. ఇలా గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్ సప్లై చెయిన్‌లో భారతదేశాన్ని ఒక ప్రధాన ప్లేయర్‌గా నిలుపుతుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌ గ్రోత్‌ ఇండస్ట్రీ లీడర్స్‌ ఈ పథకం కోసం రూ.40,000 కోట్ల భారీ బడ్జెట్‌ను ఆశిస్తున్నారు. తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. 2021లో రూ.1.97 లక్షల కోట్ల బడ్జెట్‌తో ప్రవేశపెట్టిన PLI పథకాలు ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, వైట్ గూడ్స్, టెలికమ్యూనికేషన్స్, డ్రోన్‌ల సహా 14 రంగాలను కవర్ చేస్తున్నాయి. ఈ పథకాలు ఇప్పటికే అనేక పరిశ్రమల్లో మంచి వృద్ధికి బాటలు వేశాయి. ఆటోమొబైల్ రంగంలో, అనేక ప్రపంచ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ సరఫరాదారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి దేశం ఇచ్చిన ప్రాధాన్యతతో ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ప్లేయర్‌గా నిలిచింది. PLI పథకంతో, భారతీయ తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించవచ్చు. డొమెస్టిక్‌ కాంపోనెంట్ సరఫరాదారులతో ఇంటిగ్రేట్‌ కావచ్చు, సప్లై చెయిన్ రిస్కులను తగ్గించవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.