NEWS

Budget 2025: భారీగా పెండింగ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేసులు.. ఫేస్‌లెస్ అప్పీల్స్ స్కీమ్‌ ఇంప్రూవ్ చేస్తారా..?

Budget 2025: భారీగా పెండింగ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేసులు.. ఫేస్‌లెస్ అప్పీల్స్ స్కీమ్‌ ఇంప్రూవ్ చేస్తారా..? సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను పరిష్కరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని చర్యలు ప్రకటించారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పన్నులకు సంబంధించిన అప్పీళ్లను పరిష్కరించడానికి ఎక్కువ మంది అధికారులను నియమించాలని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ వివిధ స్థాయిల్లో పన్నులకు సంబంధించిన కేసులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పెద్ద మొత్తంలో నిలిచిపోయి ఉంది. ఈ నేపథ్యంలో 2025 బడ్జెట్‌లో ఫేస్‌లెస్ అప్పీల్స్ స్కీమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (2024-25) ప్రకారం, 2024 ఏప్రిల్ 1 నాటికి సుమారుగా 3.01 లక్షల అప్పీళ్లు (2022 ఏప్రిల్ 1కి ముందు దాఖలు చేసినవి) పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి CIT (అప్పీల్స్) స్థాయి విచారణలో ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి పరిష్కరించాల్సిన అప్పీళ్ల మొత్తం సంఖ్య 5.49 లక్షలు. రానున్న బడ్జెట్‌లో వీటి షరిష్కారానికి నిపుణులు అందజేస్తున్న ప్రతిపాదనలు చూద్దాం. * గతంలో తీసుకున్న చర్యలు అప్పీల్ ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి, పెండింగ్ కేసులను తగ్గించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది: - అప్పీళ్లను దాఖలు చేయడానికి థ్రెషోల్డ్‌ని పెంచిది. దీని వల్ల చిన్న చిన్న వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు దాఖలు కావు. హై థ్రెషోల్డ్‌ కారణంగా, ముఖ్యమైన కేసులపై దృష్టి పెట్టవచ్చు. - చిన్న పన్ను అప్పీళ్లను మేనేజ్ చేయడానికి 100 మంది జాయింట్ కమిషనర్లను, ఇతర అధికారులను నియమించారు. - పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు వివాద్ సే విశ్వాస్ (VSV) పథకాన్ని రూపొందించారు. అపరిష్కృత కేసుల సంఖ్యను తగ్గించడం ఈ పథకం లక్ష్యం. - ఫేస్‌లెస్‌ అప్పీల్స్‌ కోసం ఇ-అప్పీల్స్ స్కీమ్ 2023ని లాంచ్‌ చేశారు. ఇది వర్చువల్ హియరింగ్స్ ద్వారా అప్పీల్ ప్రాసెస్‌ను క్రమబద్ధీకరిస్తుంది. * ఫేస్‌లెస్ అప్పీల్ స్కీమ్‌ ఫేస్‌లెస్ అప్పీల్ స్కీమ్‌ను 2020లో తీసుకొచ్చారు, 2021లో అప్‌డేట్ చేశారు. ఇది భౌతికంగా హాజరు కావాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. నేషనల్ ఫేస్‌లెస్ అప్పీల్ సెంటర్ (NFAC) పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 282 అప్పీల్ యూనిట్లకు కేసులు పంపిణీ చేస్తుంది. * కీలక ఫీచర్లు ఇవే - అప్పీలుదారు అభ్యర్థనపై తప్పనిసరి వర్చువల్ హియరింగ్స్‌కు అనుమతించారు. - ఇందులో ప్రాంతీయ కేంద్రాలను తొలగించారు. రివ్యూలో అదనపు లేయర్లను తీసివేయడం ద్వారా ప్రాసెస్ సులభతరం అవుతుంది. - దీని కింద చాలా అప్పీళ్లను స్వీకరిస్తారు. ఇంటర్నేషనల్‌ ట్యాక్స్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌కి సంబంధించిన నిర్దిష్ట కేసులు మినహా, అన్ని అప్పీళ్లను ఈ పథకం ద్వారా రివ్యూ చేస్తారు. * పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను పరిష్కరించడంలో సవాళ్లు ఇన్ని ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఇంకా సవాళ్లు మిగిలి ఉన్నాయి. అనేక కేసులను పరిష్కరించడానికి 20-25 సంవత్సరాలు పడుతుంది. వివాదాల వల్ల పన్ను రాబడి భారీగా ఆగిపోతుంది. అలానే పోర్టల్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సబ్మిషన్‌లను సమీక్షించకుండానే కొందరు అప్పీలేట్ అధికారులు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుత సిస్టమ్‌లో ఫిర్యాదుల పరిష్కారం, రెక్టిఫికేషన్‌, ముందస్తు విచారణ అభ్యర్థనల కోసం టూల్స్‌ లేవు. ఇవి అందుబాటులోకి వస్తే అనవసరంగా రెండోసారి అప్పీళ్లను దాఖలు చేయడాన్ని నిరోధించవచ్చు. * మెరుగుదల కోసం సిఫార్సులు నిపుణులు, వాణిజ్య సంస్థలు వ్యవస్థను మెరుగుపరచడానికి అదనపు చర్యలను సూచించాయి. అందులో, ఫస్ట్-ఇన్-ఫస్ట్-అవుట్ (FIFO) డిస్పోజల్‌: అప్పీళ్లలో పాత కేసులకు ప్రాధాన్యతనిస్తూ, ఫైల్ చేసిన క్రమంలో పరిష్కరించాలి. ఒకేలాంటి అప్పీళ్లను కలపడం: ఒకే రకమైన సమస్యలతో ఒకే పన్ను చెల్లింపుదారు ఫైల్‌ చేసే అప్పీళ్లను క్లబ్‌ చేసి సమయాన్ని ఆదా చేయవచ్చు. ITATకి అధిక వాటా కేసులు: రూ.10 కోట్ల కంటే ఎక్కువ పన్ను డిమాండ్‌లకు సంబంధించిన కేసులు నేరుగా ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)కి వెళ్లాలి. CIT కోసం స్పష్టమైన లక్ష్యాలు (అప్పీల్స్): అధికారులకు నిర్దిష్ట నెలవారీ లక్ష్యాలను కేటాయించాలి. హై-పిచ్డ్ అసెస్‌మెంట్‌ల వేగవంతమైన రిజల్యూషన్: అంచనా వేసిన ఆదాయం కంటే 3-4 రెట్లు రిపోర్ట్‌ చేస్తే, ఇలాంటి కేసులను ఇండిపెండెంట్‌ అథారిటీకి కేటాయించాలి. ఫేస్‌లెస్ అప్పీల్ పోర్టల్: ఫిర్యాదులు, రెక్టిఫికేషన్‌, ఎర్లీ హియరింగ్‌ రిక్వెస్ట్‌ ఆప్షన్లు జోడించడం ద్వారా సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా చేయవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.