NEWS

Sankranti 2025: సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా..

Sankranti 2025: సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా.. మన హిందు సంప్రదాయంలో జరుపుకునే పండుగలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ప్రతి పండుగలోనూ ప్రకృతితో శాస్త్రీయతతో కూడి అనుబంధం ఉంటుంది. దీపావళి వాతావరణంలో బాక్టీరియా తొలగించేందుకు ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ అంటే నీటిని శుద్ధి చేయడానికి,అలాగే సంక్రాంతి అంటే రైతుల పండుగ అని పిలుస్తారు. ఎందుకంటే అప్పుడే చేతికి వచ్చిన పంటలతో ఊరు వాడ రైతులంతా అంతా కలిసి మూడు రోజులా పాటు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.ఈ పండుగలలో ముగ్గులు,గొబ్బెమ్మలు, వరి ధాన్యాలు,రేగు పళ్ళు, పిండి వంటలు,బోగి మంటలు కాలుస్తుంటారు. వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఎందుకు జరుపుతారు అనే విషయాలు ఆలయ పూజారి రుద్రబాట్ల శ్రీకాంత్ ‘‘లోకల్ 18’’ తో తెలిపారు. భోగి మంటలు భోగ భాగ్యాలు… సంక్రాంతి పండుగ రైతులకు ఎంతో ప్రత్యేకత ఎందుకంటే పల్లెల్లో ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.ఈ పండుగకు దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారైనా సరే తమ స్వగ్రామాలకు చేరుకొని పిల్ల పాపలతో కుటుంబమంతా కలిసి సందడి పండుగను ఘనంగా జరుపుకుంటారు చేస్తారు. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు కాలుస్తారు, ఇంట్లో ఉన్న పాత సామాగ్రిని కాల్చేసి కొత్త సామాగ్రిని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈ మాసంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది భోగి మంటలను కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఆవు పేడతో చేసే పిడకలు భోగిమంటల్లో వేస్తారు అవి కాల్చడం ద్వారా గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి.వీటితో పాటు ఇంట్లో ఉండే పాత సామాను కూడా భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది,పాత సామాన్లు కాల్చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం వదిలి భోగభాగ్యాలు కలుగుతాయనేది నమ్మకం. ఇంటి ముంగిట రంగవల్లులు .. స్త్రీలు ప్రతి రోజూ ఇంటిముందు ముగ్గులు వేస్తుంటారు కానీ సంక్రాంతి ముగ్గు ప్రత్యేకత ఉంటుంది, లక్ష్మీదేవి తెల్లవారుజామున ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో సుఖశాంతులతో నింపుతుందని నమ్ముతారు. అందుకే మహిళలు తెల్లవారుజామున రంగవల్లులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడం శాస్త్రీయంగా మాత్రమే కాకుండా సైంటిఫిక్ గా కూడా మంచిదే, ఉదయాన్నే లేచి ముగ్గులు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న నీళ్లు ఆనందానికి నిలయంగా మారుతుంది. అలాగే ముగ్గులు వేసే క్రమంలో వ్యాయామం అవుతుంది. ఉదయాన్నే చల్లటి వాతావరణంలో ముగ్గులు వేయడం ద్వారా మైండ్ రిలాక్స్ కావడంతో పాటు రిఫ్రెష్ అవుతుంది. గొబ్బెమ్మ ప్రత్యేకత ఇదే.. హిందూ సంప్రదాయాలలో గొబ్బెమ్మను గౌరీ మాతగా కొలుస్తారు. సంక్రాంతి పండుగ రోజున ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడతారు వాటికి పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు. ముగ్గులు గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవతకి కూడా చాలా ఇష్టమని నమ్ముతారు. అందుకే పండుగ రోజున గొబ్బెమ్మలు పెట్టి స్త్రీలు చుట్టూ తిరుగుతూ పూజలు చేసి తమ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుతూ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇది గొబ్బెమ్మలకు ప్రత్యేకత. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.