NEWS

జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!

సింహాచలంలో జనవరి 10న ఉత్తర ద్వార దర్శనం దేశంలోనే రెండు అవతారాల కలయిక సింహాచలం పుణ్యక్షేత్రం ప్రత్యేకత. వరాహా, నారసింహ అవతారాలతో భక్తులకు స్వామి ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతీ ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఆలయ వర్గాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాయి. అయితే ఈ ఏడాది కూడా ఆలయ ఇవో విత్రినాధరావు ఆధ్వర్యంలో ముక్కోటికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సోమవారం కొండ దిగువున దేవస్థానం కార్యాలయంలో భక్తులు ఏర్పాట్లకు సంబంధించి ఇవో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10న ఉత్తర ద్వార దర్శనం: ఈ ఏడాది జనవరి 10న సింహాద్రినాధుడు ఉత్తర ద్వార దర్శనం ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు తెల్లవారు జామున 1 గంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావిస్తారు. అనంతరం 3.30 గంటల నుంచి 4.15 వరకు అయ్యవారి సేవ వయ్యారి నడకలతో నిర్వహిస్తారు. అనంతరం 4 గంటలకు ఉత్తర ద్వారంలో సింహాద్రి నాధుడిని ఆశీనులను చేస్తారు. తొలిదర్శనం సాంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులకు కల్పిస్తారు. అలాగే ప్రముఖులకు, ప్రోటోకాల్ విఐపి దర్శనాలు అనంతరం స్వామిని దక్షిణ రాజగోపురంలో ఆశీనులను చేసి తెల్లవా రు జామున 5 గంటల నుంచి 10.30 వరకు క్యూలైన్లలో భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. ఉత్తర ద్వారంలో కొలువున్న సింహాద్రినాధుడిని దర్శించుకుంటే సాక్షాత్తు 3కోట్ల మంది దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుందన్నది అప్పన్న భక్తుల అపార నమ్మకం. ఆరోజు సింహాద్రినాధుడు వైకుంఠ నారాయణుడిగా భక్తులకు దర్శనమిస్తారు. అలాగే భక్తులు దర్శనం అనంతరం మాడవీధుల్లో గ్రామతిరువీధి నిర్వహించి తదుపరి సాంప్రదాయ సేవలు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి 7 తరువాత భక్తులకు స్వామి దర్శనాలు లభించవు. అలాగే ఆ రోజు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఇక భక్తులకు కల్పించాల్సిన మంచినీరు, మరుగుదొడ్లు, రవాణా ఇతర ఏర్పాట్లపై వీరు చర్చించారు. అలాగే 9వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు సింహాచలం పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరపరాదు అని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. స్వామివారి దర్శనానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.