NEWS

Justin Trudeau: జస్టిన్ ట్రూడో సంచలన నిర్ణయం.. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా

Justin Trudeau: ప్రపంచ రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేదు. తాజాగా కెనడా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవితో పాటుగా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు విముక్తి పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూడో వెల్లడించారు. గత కొన్ని తాను రాజీనామా చేస్తున్న వస్తున్న వార్తలను నిజం చేస్తూ ట్రూడో మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి పదవికి, పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయనున్న విషయాన్ని నేను అధికారికంగా గవర్నర్ జనరల్‌కు, పార్టీకి తెలియజేశాను. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న వెంటనే బాధ్యతల నుంచి వైదొలుగుతాను. ఈ ప్రక్రియ కొనసాగించేందుకు మార్చి 24 వరకు పార్లమెంటును ప్రొరోగ్ చేస్తున్నాను’’ అని బహిరంగంగా వెల్లిడించారు. కెనడా చట్టం ప్రకారం.. అధికార పార్టీ నేత రాజీనామా చేస్తే 90 రోజులలోపే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. జస్టిన్ ట్రూడోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతుండటంతో లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తగ్గిపోయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల, ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే.. కెనడా ఉప ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆమె ఆరోపించారు. ట్రూడో కేబినెట్‌లో శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె రాజీనామా చేయడం లిబరల్ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. దాదాపు దశాబ్ద కాలం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఆయనను మరింత దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో ట్రూడో రాజీనామా చేయాల్సిందేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత, లిబరల్ పార్టీ తన భవిష్యత్తు మార్గాన్ని ఎలా నియమించుకుంటుందో చూడాలి. అయితే, ట్రూడో రాజీనామా నిర్ణయం కెనడా రాజకీయాలకు కీలక మలుపుగా నిలవడం ఖాయం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.