NEWS

HMPV Virus: ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న కొత్త వైరస్.. హెచ్చరికలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Human Metapneumovirus: గత కొన్ని రోజులుగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) ఈరోజు భారత్‌లో కూడా నమోదైంది. తాజాగా, ఈ ఒక్కరోజులోనే నాలుగు కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, కోల్‌కత్తాలో ఒకటి కేసులు గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో HMPV గురించి అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ‘‘ఈ వైరస్ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదని ఇప్పటికే భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) స్పష్టం చేసింది’’ అని మంత్రి తెలిపారు. HMPV మీద రాష్ట్ర వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. వైరస్‌కు అవసరమైన వైద్య పరికరాలు సిద్ధం చేశామని, పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌లను అందుబాటులో ఉంచినట్లు. అలాగే యాంటీ డ్రగ్ డోసులు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి తాజాగా వెల్లడించారు. HMPV రాకతో రాష్ట్రంలో కొత్త ప్రొటోకాల్‌ను అమలులోకి తీసుకువచ్చినట్లు సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. HMPV కేసులు కర్ణాటక, గుజరాత్‌లో వెలుగుచూడడంతో ఆ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, జ్వరంతో లేదా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. HMPV విషయంలో ప్రజారోగ్యానికి సంబంధించిన నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం. కేంద్రం ఏం చెప్పిందంటే? ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌, NCDC వైరస్ వ్యాప్తిని నిరంతరం గమనిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవని, అన్ని ఆరోగ్య నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించారు. ఇది కొత్త వైరస్ కాదని, గతంలో కూడా దీని ఆనవాళ్లు గుర్తించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి. భయపడకుండా ప్రభుత్వం సూచనలను పాటించాలి. “ప్రజల ఆరోగ్యం రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం” అని నడ్డా చెప్పారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.