NEWS

HMPV వైరస్ సోకితే ఏం చేయాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

HMPV వైరస్ సోకితే ఏం చేయాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.. ఐదు సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ సంఘటనలు మర్చిపోకముందే.. చైనాలో హెచ్‌ఎంపీవీ అనే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఐతే ఇది 2024లోనే 327 HMPV కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 2023లో 225 కేసులతో పోలిస్తే 45% పెరుగుదల కనిపించిందని డాక్టర్స్ చెబుతున్నారు. చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.మరికొద్ది గంటలలోనే గుజరాత్ రాష్ట్రం మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు తెలుస్తుంది. జ్వరం రావడంతో వీరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలో HMPV వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే వైరస్ లక్షణాలు ఏంటి.. ఇది ఎంతవరకు ప్రమాదకరం? నివారణ ఏంటి అనే విషయంపై లోకల్ 18 డాక్టర్స్ పలకరించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆయన మాట్లాడుతూ.. ‘HMPV వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే, ఇది మ్యుటేషన్ అవునా, కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ HMPV వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది. సాధారణ HMPV వైరస్ కూడా భారతదేశంలో 0.78% కనిపిస్తుంది. ఈ రోజు సోకిన ఈ పాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ తిరునాధర్ తెలిపారు. చైనాలో ఆందోళనకు కారణమైన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ లేదా HMPV కొత్తది కాదు. 2001లో ఇది మొదటిసారిగా కనుగొన్నారు. కరోనా వైరస్ లేదా COVID-19 ఒక అంటు వ్యాధి. ఇది ఒకరి నుండి మరొకరికి సోకేది..కానీ ఇది అలా కాదు..ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం HMPV వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి టీకా లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ హెచ్ఎంపివీ వైరస్ లక్షణాలు కనిపిస్తే ఇంటి లోపలనే మూడు నుంచి నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వ్యక్తులు బయట తిరగకపోవడం ఇంకా మంచిది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.