NEWS

Job Mela: 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా.. రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

mini job mela, job mela, JOBS, employement, ఎంప్లాయ్‌మెంట్, ఉద్యోగం, జాబ్స్, ఉద్యోగం, జాబ్ మేళా ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలుజిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకుఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం అధికారి పి. దీప్తి తెలిపారు. ఇందుకు సంబధించి నిరుద్యోగులు పదవ తరగతి పూర్తి చేసి,ఐ.టి.ఐ లో ఫిట్టర్ , ప్లంబర్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్, సివిల్, లేదా ఇంటర్, డిగ్రీ, పూర్తి చేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 27-08-2024 మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, కర్నూలు వారి ఆధ్వర్యంలో 27.08.2024న ఉదయం 10.00 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉద్యోగ మేళలో నవ భారత్ ఫర్టిలైజర్,ఆక్సిస్ బ్యాంక్, ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్,ఫోన్ పే, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయని తెలిపారు. ఇందులో ఎంపికైన వారికీ జీతం రూ.16,000 లనుంచి 18,000 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. జీతంతో పాటు 2నెలల పాటు ఉచిత శిక్షణ కూడా అందిస్తారని తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపిన ఆమె ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతజిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు www.ncs.gov.in వెబ్ సైట్ లోరిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9908114205 అనే నెంబర్ ను సంప్రదించాలని కోరారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.