NEWS

గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు.. నల్గొండ జిల్లా అతలాకుతలం..

గురుకుల పాఠశాలలో వరుస ఫుడ్ పాయింట్స్ తో నల్గొండ జిల్లా అతలాకుతలం! నల్గొండ జిల్లాలో గురుకుల పాఠశాలలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. దేవరకొండలోని పీఏ పల్లి సంఘటన మరువకముందే, అదే పట్టణంలోని పెంచికల్‌పహాడ్ బాలికల గురుకుల పాఠశాలలో మరో ఘటన జరిగింది. ఉడికి ఉడకని అన్నం తినడంతో ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం నాణ్యమైన ఆహార సరఫరా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థులు ఆహారంపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “బియ్యం ఉడకడం సరిగా లేదు. అన్నం తినేటప్పుడు గంజి పట్టినట్లు ఉంటుంది. దీని వల్ల అస్వస్థతకు గురవుతున్నాం,” అని విద్యార్థినులు తెలిపారు. చాలా మంది భయంతో అన్నం తినకుండా నిరసనకు దిగారని, ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని చెప్పారు. గత రాత్రి ఏడు మంది విద్యార్థినులు వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు ముందు కొన్ని రోజులుగా విద్యార్థినులు “ఆహారం నాణ్యంగా లేదని” చెబుతుండగా, ఈ సమస్యను పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉదయం దొడ్డు రవ్వ తినడం, మధ్యాహ్నం భోజనానికి బియ్యం పాడై ఉండడం వల్ల విద్యార్థులు అన్నం తినకుండా ఉండిపోయారు. ఈ ఘటనలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పూజిత, మౌనిక, మల్లీశ్వరి, హరిణి, అలాగే రెండో సంవత్సరం చదువుతున్న నిఖితలు బాధితులుగా గుర్తించారు. హాస్టల్ విద్యార్థులు తక్షణమే పాడై ఉన్న బియ్యం మార్చి, నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇంతలో.. పీఏ పల్లి మోడల్ స్కూల్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ త్రిపాఠి పరామర్శించారు. “ఎక్కడ సమస్య ఉందో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. “విద్యార్థుల ఆరోగ్యం ప్రధానంగా నిలవాలి” అని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.