వినేశ్ ఫోగట్ (ఫైల్ ఫోటో) Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024)లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. మహిళల 50 కేజీలు ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వినేశ్.. వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఫైనల్ బౌట్ కు ముందు ఆమె వెయిట్ నిర్ణీత 50 కేజీల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో వినేశ్ ఫోగట్ ను డిస్ క్వాలిఫై చేశారు. వినేశ్ అనర్హతకు గురవ్వడంతో భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)తో పాటు వైద్య బృందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఈ వ్యవహారంపై భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు ముగియగా.. ఆగస్ట్ 13న తుది తీర్పు వెలువడనుంది. అయితే ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో వినేశ్ ఫోగట్ దే తప్పంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో ఐఓఏ వైద్య బృందం తప్పిదం ఏ మాత్రం లేదంటూ.. వారిని విమర్శించడం సిగ్గు చేటంటూ కామెంట్స్ చేశారు. ఐఓఏ వైద్య బృందం ఆటగాళ్ల గాయాలు మాత్రమే చూస్తారని.. బరువు పెరగడం.. తగ్గడం వంటి అంశాలు వారికి సంబంధం లేని విషయాలని పేర్కొన్నారు. వినేశ్ ఫోగట్ ను అనర్హత వేటు వేసిన తర్వాత ఐఓఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలపై విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా పీటీ ఉష ఈ కామెంట్స్ చేశారు. వెయిట్ కేటగిరీకి సంబంధించిన క్రీడల్లో బరువు బాధ్యత సదరు కోచ్ లు, ప్లేయర్ల దే అంటూ ఆమె కామెంట్స్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కేవలం 6 పతకాలను మాత్రమే సాధించి 71వ స్థానంలో నిలిచింది. టోక్యోలో చేసిన ప్రదర్శనతో చూస్తే ఇది పేలవంగా ఉంది. టోక్యోలో బంగారు పతకాన్ని సాధించగా ఈసారి మాత్రం నిరాశ ఎదురైంది. వచ్చిన పతకాల్లో 6 కాంస్య పతకాలు కాగా.. కేవలం ఒక రజత పతకం మాత్రమే ఉంది. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.