NEWS

Delhi Air Pollution: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌ను క్యాష్ చేసుకుంటున్న హోటల్స్.. ఎలాగంటే?

Delhi Air Pollution: చలికాలం వచ్చిందంటే దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఒక రేంజ్‌లో పెరుగుతుంది. దీంతో గాలి నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index- AQI) దారుణంగా పడిపోతుంది. ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీ చరిత్రలోనే అత్యంత దారుణ స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. గత నెలలో ప్రతిరోజు ఏక్యూఐ ‘వెరీ పూర్’ కేటగిరీగా నమోదైంది. ఇందులో ఆరు రోజులు తీవ్రమైనవిగా రికార్డు కాగా, రెండు రోజులు అతి తీవ్రంగా ఉంది. చుట్టుపక్కల రాష్ట్రాలు పంట వ్యర్థాలు దహనం చేయడంతో ఆ పొగ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. అయితే ఓ వైపు ఢిల్లీ వాసులు గాలి కాలుష్యంతో ఇబ్బంది పడుతుంటే, మరోవైపు బడా రెస్టారెంట్లు, 5 స్టార్ హోటళ్లు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి. రాజధానిలోని ప్రముఖ హోటళ్లు, కస్టమర్లకు నాణ్యమైన గాలిని ఓ సర్వీస్ కింద ప్రొవైడ్ చేయడం వైరల్‌గా మారింది. * కొత్త సర్వీస్ ఢిల్లీలోని చాలా 5 స్టార్ హోటళ్లు నాణ్యమైన గాలిని ప్రీమియం సర్వీస్ కింద కస్టమర్లకు ఇంట్రడ్యూస్ చేశాయి. తమ హోటల్ రూమ్స్‌లో శుభ్రమైన గాలి లభిస్తుందంటూ ప్రత్యేకంగా బోర్డులను సైతం ఏర్పాటు చేశాయి. బయట సిటీలో ఉన్న ఎయిర్ క్వాలిటీతో పోలుస్తూ గదుల్లో ప్రొవైడ్ చేసిన నాణ్యమైన గాలి గురించి మెన్షన్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండటానికి వచ్చిన కస్టమర్లకు ఇది తప్పనిసరి సర్వీసుగా మారింది. దీంతో హోటళ్లకు వస్తున్న గెస్ట్‌లు ఈ ఆఫర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని హోటల్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతోంది. * ఫోటో వైరల్ అమెరికన్ బిలియనీర్ బ్రియాన్ జాన్సన్, ప్రముఖ ఒబెరాయ్ హోటల్‌ అందిస్తున్న ప్రీమియం సర్వీసుకు సంబంధించిన ఫొటోను ఎక్స్ ప్లాట్‌ఫారంలో షేర్ చేశారు. ‘మా గెస్ట్ రూమ్స్‌లో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2.4’ అని క్యాప్షన్ ఇస్తూ గాలి నాణ్యతను సూచిస్తున్న సైన్ బోర్డ్ ఫొటోను పోస్ట్ చేశారు. ‘శుభ్రమైన గాలిని సర్వీసు కింద హోటల్ అమ్ముతోంది. ప్రతి గదిలో స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్లను ఇన్‌స్టాల్ చేయడం నిజంగా సంతోషకరం’ అంటూ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన హోటల్‌కు థాంక్స్ చెప్పారు. * యూజర్ల కామెంట్లు అమెరికాలో ఇన్వెస్టర్‌గా పనిచేస్తున్న ఇండియన్ ఇంజినీర్ దేబర్‌గ్యా దాస్ సైతం తన అనుభవాన్ని వెల్లడించారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ సైన్ బోర్డు ఫొటోను దాస్ షేర్ చేశారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 397 కాగా, గెస్ట్ రూమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 58 మాత్రమే ఉన్నట్లు సైన్ బోర్డులో హైలైట్ చేశారు. ఈ పోస్టులకు సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఇలాంటి అల్ట్రా లగ్జరీ సర్వీసును కొన్ని అపార్ట్‌మెంట్లలో కూడా ఆఫర్ చేయడం చూశానని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇదొక స్మార్ట్ ఐడియా అంటూ మరొకరు పొగిడారు. ‘గాలి, నీరు అందరికీ అందడం ఓ ప్రాథమిక హక్కుగా ఉండాలి. కానీ, సినిమాల్లో చూపించినట్లుగా ఇండియాలో రాను రాను గాలిని, నీరును కొనే దుస్థితి రావొద్దు’ అని ఒక సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.