NEWS

కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..

కేటీఆర్ పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరు వినండి..!! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది. అందులోనే భాగంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ సూత్రధారి అంటూ విమర్శలు కూడా చేసింది. ఈ కేసు విషయంలోని ఇప్పుడు ఏసీబీ రంగంలో దిగింది. కేసు నమోదు చేసింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను ఈ కేసులో ఏ1 గా చేర్చింది. ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ బి.ఎల్.ఎన్ రెడ్డి, పేరును చేర్చింది. ఈ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారాలు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ 55 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1 గా చేర్చింది. అలాగే అరవింద్ కుమార్ ను ఏ2 గా చేర్చింది. ఇందులోనే భాగంగా దీనిపై నాలుగు సెక్షన్ల కింద నాన్ బెయిల్ కేసులు నమోదు చేసినది. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తారా. కేటీఆర్ ను అరెస్టు చేస్తే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది, అనే విషయంపై లోకల్ 18 టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, కార్యకర్తలను పలకరించగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేటీఆర్ ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతుందని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అంటున్నారు. నిన్న ఇదే విషయంపై అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టమని కేటీఆర్ సభాముఖంగా తెలిపినా కూడా చేతగాని రాష్ట్ర మంత్రులు దద్దమ్మలాగా కూర్చుండిపోయారే తప్ప ఎవరు కూడా ఈ విషయంపై మాట్లాడలేదన్నారు. పీఎం, సీఎం వచ్చినా కూడా కేటీఆర్ ను ఏం చేయలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు పోయాము. జైలుకు వెళ్లడం మాకేం కొత్తేం కాదంటూ పార్టీ శ్రేణులు తెలిపారు. ఇప్పటికైనా ఈ రాజకీయ కక్షపూరితమైన నీచపు పనులు రేవంత్ ఆపాలని ఈ సందర్భంగా తెలిపారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.